Home Tollywood ప్ర‌శంశ‌లు అందుకుంటున్న " ప్రేమ‌క‌థాచిత్రమ్ 2" టీజ‌ర్ 

ప్ర‌శంశ‌లు అందుకుంటున్న ” ప్రేమ‌క‌థాచిత్రమ్ 2″ టీజ‌ర్ 

“ప్రేమ కథా చిత్రమ్ 2” అంటూ ప్రేమ‌క‌థ‌చిత్ర‌మ్ కి సీక్వెల్ గా వ‌స్తున్న చిత్రం యెక్క టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ట్రెండి గా వుంటూ బ్యాక్ టు ఫియ‌ర్ అనిపించేలా టీజ‌ర్ అంద‌రి చేత ప్ర‌శంశ‌లు పొందుతుంది. ప్రేమ‌క‌థా చిత్రమ్‌, జక్కన్న చిత్రాలు త‌రువాత హ్య‌ట్రిక్ చిత్రంగా  ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ఆర్ సుద‌ర్శ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇద్నాని లు జంట‌గా న‌టిస్తున్నారు. ఈ టీజ‌ర్ లో  ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి షాక్ ఇచ్చిన నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా హైటెన్ష‌న్ పెర్‌ఫార్మెన్స్ చూపించింది. టీజ‌ర్ లో రొమాంటిక్ మూడ్ నుండి హ‌ర్ర‌ర్ మూడ్ లోకి  నందిత ఇచ్చిన ఛేంజ్ ఓవ‌ర్ మాత్రం ఈత‌రం హీరోయిన్స్ కి ఛాలెంజ్ గా నిలుస్తుంద‌నే అనే చెప్పాలి. హ‌ర్ర‌ర్ కామెడి కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నిలిచిన ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ సీక్వెల్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో కామెడి కి మ‌ళ్ళి పెద్ద‌పీట వేశార‌నేది టీజ‌ర్ ఎండింగ్ చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతుంది. సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వుంటుంద‌నేది ఈ టీజ‌ర్ చెప్పే మేట‌ర్‌.. 

 

ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ..” ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాదించిందో అంద‌రికి తెలుసు.. ఈ రోజు విడుద‌ల చేసిన ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2  టీజ‌ర్ చూసినివారంతా కూడా అదే రేంజి చిత్రం అవ్వ‌బోతుంద‌ని చెప్ప‌టం చాలా ఆనందంగా వుంది. టీజ‌ర్ లో హీరో సుమంత్ అశ్విన్‌, సిద్ది ఇద్నాని లు చాలా ప్లెజంట్ గా నటిస్తే.. నందిత శ్వేత త‌న విశ్వ‌రూపం చూపించింది. నిజంగా ప్రేక్ష‌కులు చూసింది టీజ‌ర్ మాత్ర‌మే.. ఇంకా చాలా వుంది. ఈ సినిమా మెద‌టి భాగాన్ని మించి వుండ‌బోతుంది.  జ‌న‌వ‌రి లో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము “అని అన్నారు.

 

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

 

సాంకేతిక నిపుణులు : 

కెమెరామెన్ – సి. రాం ప్రసాద్, 

ఎడిటర్ – ఉద్ధవ్ య‌స్‌.బి 

సంగీతం – జె.బి 

డైలాగ్ రైటర్ – గ‌ణేష్‌

లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.

ఆర్ట్ – కృష్ణ‌

కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి

నిర్మాత –  ఆర్. సుదర్శన్ రెడ్డి

దర్శకుడు – హరి కిషన్

 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News