ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ సైన్స్ ఫిక్ష‌నా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం ప్ర‌త్యేకంగా వేసిన సెట్లో జ‌రుగుతోంది. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ప్ర‌భాస్ నాగ్ అశ్వ‌న్ దర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ని చిత్ర బృందం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. వైజ‌యంతి సంస్థ 50వ వసంతంలోకి ఎంట‌ర‌వుతున్న సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అత్య‌త ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం కాద‌ని, పాన్‌ వ‌ర‌ల్డ్ అని ద‌ర్శ‌కుడు సోష‌ల్‌మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌డంతో ఇది సోషియో ఫాంట‌సీ సినిమా అని ప్ర‌చారం మొద‌లైంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఇది సైన్స్ ఫిక్ష‌న్ అని తెలుస్తోంది. `మిస్టర్ అండ్ మిస్‌` మూవీ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్స‌న్ అండ్ ఫాంట‌సీ జోన‌ర్ చేయాల‌ని వుంద‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో ప్ర‌భాస్ హీరోగా త‌ను చేయ‌బోతున్నసినిమా సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో వుండే అవ‌కాశం వుంద‌ని అర్థ‌మ‌వుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ చేయ‌బోతున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.