ప్రతీ రోజూ పండగే: సాయి ధరమ్ తేజ్-మారుతి చిత్రం ప్రారంభం

‘చిత్రలహరి’ తో విజయం అందుకున్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ గాడిలో పడినట్టే ఉంది. నేటి తరానికి నచ్చే సినిమాలు తీయడంలో సిద్ధ హస్తుడైన దర్శకుడు మారుతీ తో సాయి ధరమ్ తేజ్ సినిమా నిన్న ప్రారంభం అయింది. ఈ సినిమాకి ‘ప్రతీ రోజూ పండగే’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాత కాగా గీతా ఆర్ట్స్ మరియు యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తోంది. ఇది వీరిద్దరి కలయికలో రెండో చిత్రం.
ఇక ఈ సినిమాలోని కీలక పాత్రల్లో కట్టప్ప ‘సత్య రాజ్’ మరియు రావు రమేష్ నటిస్తున్నారు. దర్శకుడు మారుతి అత్యంత శ్రద్ధతో సత్య రాజ్ పాత్రను తీర్చి దిద్దారట.
కధ, దర్శకత్వం: మారుతి
నిర్మాత: బన్నీ వాసు
సంగీతం: ఎస్ ఎస్ థమన్