పెళ్లి ఎలా చేసుకోనుందో చెప్పిన రేణూ దేశాయ్

పవన్ తో విడిపోయినప్పటి నుండి పిల్లలతో ఒంటరిగానే ఉంటున్నారు రేణూ దేశాయ్. తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం తెలియగానే పవన్ అభిమానులు రేణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మాటల దాడి చేశారు. కొంతమంది చంపేస్తాం అంటూ బెదిరించారు కూడా. వారి కామెంట్స్ తట్టుకోలేక ట్విట్టర్ నుండి బయటకు వచ్చేసింది రేణూ. ఆ తర్వాత పవన్ అభిమానులను ఉద్దేశించి ఒక ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేసింది తన యూట్యూబ్ ఛానల్ లో. విడాకులు నేను ముందు అడగలేదు. ఆయనే కోరుకున్నారు. మీ హీరో నా నుండి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అతనికి వేరొక భార్య ఉంది. మీ ప్రేమను ఆమెకు పంచండి. నన్ను వదిన అని పిలవండి తప్పు లేదు కానీ కళ్యాణ్ గారితో నాకు ముడి పెట్టి పిలవకండి. నేను వేరొకరి భార్యని కాబోతున్నాను త్వరలో. దయచేసి నన్ను ప్రేమించకపోయినా పర్లేదు కానీ వేరొకరిని పెళ్లి చేసుకుని, బిడ్డకు తండ్రి అయిన కళ్యాణ్ గారితో నన్ను ముడి పెట్టి తిట్టకండి. ఇది నాకు కాబోయే అత్తింటివారికి ఇబ్బందికర విషయం. అని రిక్వెస్ట్ చేసింది.

విడాకుల తర్వాత ఒక సంవత్సరంపాటు డిప్రెషన్ లో ఉన్నాను. అనారోగ్య సమస్యలతో బాధ పడ్డాను. ఇవేమి పిల్లలకి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఒక స్యాడ్ మదర్ గా వారికి నేను కనిపించాలి అనుకోలేదు. అందుకే ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ నాలోనే దాచుకుని న పిల్లలకి ఒక హ్యాపీ మదర్ లా వారిని పెంచాను. సింగిల్ పేరెంటింగ్ చాలా కష్టం. ఎనిమిదేళ్లపాటు ఒంటరిగా ఉన్నాను. చాలా కౌన్సిలింగ్ తర్వాత నాకోసం, నా పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పిల్లలకి కూడా నచ్చాడు. పిల్ల్లలు అతనితో బాగా కలిసిపోయారు. నేను పెళ్లి చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. మా పెళ్లిపై పవన్ కి కూడా అభ్యంతరం లేదు మరి మీరెందుకు నన్ను తిడుతున్నారు అంటూ పవన్ అభిమానులను ప్రశ్నించింది. దయచేసి అర్ధం చేసుకోండి. నాపైన ట్రోల్ల్స్ ఆపేయండి అంటూ వారికి సూచించింది. ఇది ఆ ఇంటర్వ్యూ సారాంశం.

తాజాగా ఒక ఆంగ్ల దిన పత్రిక రేణూ దేశాయ్ వివాహం ఎలా చేసుకోనుంది అనే కధనం ప్రచురించింది. తను వివాహాన్ని చాలా సాదా సీదాగా జరుపుకోనుందట. కోయంబత్తూర్, ఇషా సెంటర్ నందు గల లింగ భైరవి టెంపుల్ లో కొద్దిమంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తన వివాహం జరగనుందట. వివాహం కోసం భారీగా ఖర్చులేవి చేయట్లేదట. మేకప్, ఆభరణాల కోసం చేసే ఖర్చుతో అన్నదానము చేయాలని నిర్ణయించుకున్నారట. పవన్ కి 2008 లో విడాకులు అయ్యాయి, 2009 లో వీరి వివాహం జరిగింది. అప్పుడు కూడా తన వివాహం చాలా సింపుల్ గా జరిగిపోయింది. అందుకే ఈసారి తన స్నేహితులు సంగీత్, మెహందీ కార్యక్రమాలను ఘనంగా నిర్వించాలని కోరుకుంటున్నారట కానీ అందుకు రేణూ ఒప్పుకోవట్లేదు. అయితే తన పెళ్లి వేడుకకు ఒక 40 మంది స్నేహితులను కూడా ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.