ప్రపంచం కరోనా వైరస్ కారణంగా అల్ల కల్లోలం అవుతోంది. ఎక్కడ చూసినా కరోనా మరణాలే. దేశం కరోనా కారణంగా భయంతో కంపించిపోతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ జనం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని రద్దు చేసుకుంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో రేపు (30)న తన పుట్టిన రోజుని హీరో నితిన్ రద్దు చేసుకున్నారు. అలాగే ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నట్టు వెల్లడించారు నితిన్.
`నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. రేపు నా పుట్టిన రోజును జరుపుకోవడం లేదు. అలాగే ఏప్రిల్ 16న జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నా. నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడని లాక్ డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా నా పుట్టిన రోజు వేడుకల్ని జరుపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీన జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం వుంది. ఈ సంక్షభ సమయంలో మన ఇళంలల్లో మనం కాలు మీద కాలేసుకుని కూర్చోని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా వుండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ నితిన్. అని మీడియాకు నితిన్ లో లేఖని రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా నితిన్ పెళ్లి వాయిదా వేయాల్సిందేనా అని వరుస కథానాలు వినిపించిన విషయం తెలిసిందే.