పిచ్చి పీక్స్ కు…హీరో వీర్యం కావాలంటూ రచ్చ

ఇలా మాట్లాడితేనే హాట్ టాపిక్ అవుతారమ్మా

తనకు బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌ వీర్యం కావాలని ఓ మహిళా క్రికెటర్ చేసిన బోల్డ్ కామెంట్స్ సంచలనంగా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. పబ్లిసిటీ కోసం ఆమె ఇలాంటి కామెంట్స్ చేసిందని కొందరంటూంటే మరికొందరు కాదు పిచ్చి పీక్స్ కు చేరింది..అందుకే ఇలా మాట్లాడిందని విమర్శలు చేస్తున్నారు.

వివరల్లోకి వెళితే..తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన, ఇటీవల విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న వార్ సినిమా చూసిందట. అయితే, సినిమా చూసొచ్చిన తర్వాత హృతిక్ అందానికి ఫిదా అయిపోయానని, సినిమా చూస్తున్నంత సేపు కళ్లను తిప్పుకోలేకపోయానని.. హృతిక్ రోషన్‌ను అలాగే చూస్తుండిపోయానని చెబుతుంది ఈ భామ. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్‌పై అంతులేని ప్రేమను పెంచుకున్న భావన.. ఏకంగా హృతిక్ రోషన్‌తో తనకు సంతానం కావాలని, అతడిలాంటి పిల్లలు కావాలంటే అతడి స్పెర్మ్ కావాలంటూ సంచలన ట్వీట్ చేసింది

. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈమె హాట్ టాపిక్ అయిపోయింది. ఓ సినీ హీరోపై ఇంత బోల్డ్‌గా ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. కాగా, భావన బోల్డ్ కామెంట్స్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన అభిమాన హీరోపై ఉన్న ప్రేమను మామూలుగా వ్యక్తపరిస్తే సరిపోయిది కదా అంటున్నారు. ఇప్పుడీ ట్వీట్ స్పూర్తితో మరికొంతమంది రెచ్చిపోతారమో అని కొందరు సుద్దులు చెప్తున్నారు. మరి ఈ ట్వీట్ పై హృతిక్ రోషన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.