పవన్ కోసం బండ్ల 60 కోట్ల  ప్లాన్ ? 

 
జనసేన అధినేత పవర్ స్టార్  ప‌వ‌న్ కళ్యాణ్ కు అభిమానుల రూపంలో ఎంతమంది భక్తులు ఉన్నా.. వాళ్ళందరికంటే  కూడా  పవర్ స్టార్ కి  తానే పరమ భక్తుడ్ని అని అవకాశం దొరికినప్పుడల్లా  సగర్వంగా చెప్పుకుంటుంటాడు నిర్మాత బండ్ల గ‌ణేష్. అయితే ఇటీవలే  ఈ భక్తుడు అనేక వివాదాలతో వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక తాజాగా బండ్లకు పవన్ కళ్యాణ్ తో ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమా నిర్మించాలని ఉందట. దాని కోసం సైలెంట్ గా గత కొన్ని రోజులుగా ముమ్మరంగానే  ప్రయత్నాలు చేస్తున్నాడట.  కానీ పవన్ కళ్యాణ్  ఇప్పటికే ఒపుకున్న సినిమాలనే  చేయలేక పోస్ట్ ఫోన్ చేసుకుంటూ పోతున్నాడు.
 

  అయితే  పవన్ కొత్త సినిమాలు కూడా ఒప్పుకుంటుండటంతో  బండ్లలో ఆశ పుట్టింది. ఎలాగైనా పవన్ ను ఒప్పించాలని కిందా మీద పడుతున్నాడట. ఆ మేరకు కొంతమంది స్టార్ డైరెక్టర్స్ తో  కూడా ఇప్పటికే  బండ్ల మాట్లాడాడు అట.  ఎలాగూ కాంబినేషన్ లను కలిపేసి  భారీ సినిమాలు నిర్మించడంలో  బండ్ల గణేష్ కు బట్టర్ తో పెట్టిన విద్య అయ్యే.  ఇప్పుడు  ఆ విద్యనే వాడి పవన్ కళ్యాణ్ ను కాక పడుతున్నాడట. ఇప్పట్లో కాకపోయినా భవిష్యత్తులోనైనా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా  సినిమా చేయడానికి అంగీకరిస్తే   పవన్ కి 60 కోట్ల రెమ్యునేష‌న్ ఇచ్చుకుంటానని కూడా చెప్పుకొచ్చాడట బండ్లవారు.

 
ఇలా రెమ్యున‌రేష‌న్ ల రూపంలో 70 కోట్లు గుమ్మరించి..  మరో 60కోట్ల‌లో ఎలాగోలా సినిమాను పూర్తి చేసి..సినిమాను 190 కోట్లకు బిజినెస్ చేసుకోవాలని ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్  ప్లాన్.  మరి బండ్ల ప్లాన్, ప్లాన్ గానే మిగిలిపోతుందో లేదా  భారీ స్థాయిలో నేరవేరుతుందో చూడాలి.