‘నోటా’కి అదొక్కటే మైనస్..మిగతాదంతా కేకే

వరస విజయాల  హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన ‘నోటా’ సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ఈ చిత్రం దర్శకుడు గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

దర్శకుడు ఆనంద్ శంకర్ రెండు చిత్రాలు తెలుగులో వర్కవుట్ కాలేదు. అదేంటి తెలుగులో ఆనంద్ శంకర్ కు ఇదే కదా తొలిసినిమా అంటారా..తొలి సినిమానే కావచ్చు కానీ…ఆయన డైరక్ట్ చేసిన తమిళ సినిమా అరిమినంబి గంతలో మంచు విష్ణుతో డైనమేట్ టైటిల్ తో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది. సర్లే అని విక్రమ్ హీరోగా డ్యూయిల్ రోల్ లో ఇరుమగన్ తీసారు. ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యింది. కానీ ఆ సినిమానూ తెలుగులో డిజాస్టరే. ఆ పద్దతిన చూస్తే  తెలుగులో ఆనంద్ శంకర్ కు ఇది మూడో సినిమా. మరి రెండు డిజాస్టర్స్ కావటంతో ఈ సినిమా పై ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. గీతాగోవిందం వంటి హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమా బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ డైరక్టర్ ట్రాక్ రికార్డే దెబ్బకొడుతోంది. అయితే ఈ సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుని చేసారని చెప్తున్నారు. మరి చూడాలి. ఏ మేరకు ఈ సినిమా యూత్ లోకి వెళ్తుందో..

ఈ చిత్రంలో విజ‌య్ ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న   “నోటా”పై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు సూపర్  రెస్పాన్స్ వ‌చ్చింది. అంతేకాదు ఒకేసారి తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. త‌మిళ్ వ‌ర్ష‌న్‌లోనూ విజ‌య్ సొంత డ‌బ్బింగ్ చెప్పుకున్నారు.

“నోటా”లో మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ
నిర్మించింది. శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.