నిశ్చితార్థం ఒట్టి మాటేనట

గ్లామర్ హీరోయిన్ రెజీనాకు పెళ్లి ఫిక్సయ్యిందని, రహస్యంగా నిశ్చితార్థం జరిగిందంటూ కథనాలు వెలువడటం తెలిసిందే. ఇటీవల కేవలం కుటుంబీకుల సమక్షంలో రెజీనా నిశ్చితార్థం జరిగిందని, వచ్చే నెలలో వివాహం జరగనుందన్నది ఆ వార్తల సారాంశం. సోషల్ మీడియాలో న్యూస్ ట్రోల్ అవ్వడంతో రెజీనా స్పందించింది.

తనకు నిశ్చితార్థం జరిగినట్టు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ‘నా నిశ్చితార్థం కథనంలో నిజం లేదు. ఆ వార్తలను నమ్మొద్దు. పెళ్లి సందర్భం వచ్చినపుడు తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటా’ అంటూ స్పందించింది. ప్రస్తుతం రెజీనా స్పందనతో నిశ్చితార్థం వార్త పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది రెజీనా బ్యూటీ.