యంగ్ హీరో నితిన్ పెళ్లి మూహూర్తం మార్చాల్సిందేనా? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించిన షాలినితో నితిన్ ఫిబ్రవరి 15న ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లిని దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఏప్రిల్ 16న ప్లాన్ చేసుకున్నాడు నితిన్. అయితే తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఒక విధంగా చెప్పాలంటే భయంకరంగా మారిపోయాయి. యుగాంతాన్ని తలపించే భయానక వాతావరణం ఒక్కసారిగా క్రియేట్ అయ్యింది.
దీంతో నితిన్ వివాహ ముహూర్తం మార్చడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఉగాది నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ని ఈ నెల 15 వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. నితిన్ వివాహం లాక్ డౌన్ విరమించిన మరుసటి రోజే జరగాలి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా వైరస్ రోజు రోజుకీ ప్రబలుతుండటంతో కేంద్రం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. దీంతో నితిన్ పెళ్లి ముహూర్తం వాయిదా వేయడం తప్ప మరో దారి కనిపించడం లేదు నితిన్‌కి. ఏం జరుగుతుందో తెలియని ఈ విపత్క పరిస్థితుల్లో వివాహం చేసుకోవడం కంటే పరిస్థితులు చక్కబడ్డాకే నితిన్ వివాహం చేసుకుంటాడేమో చూడాలి.