(సూర్యం)
తెలుగు పరిశ్రమలో, మీడియాలో ఒక చిత్రమైన యాంగిల్ ఉంది. ఒక్క హిట్ వస్తే ఎక్కడికో మోసేస్తారు. అదే ఒక్క ప్లాఫ్ వస్తే అంతే వేగంగా క్రింద పడేస్తారు. ఈ విషయంలో కొంచెం కూడా మొహమాటం లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్దితి అలాగే ఉంది. గీతా గోవిందం హిట్ తొ మీడియా మొత్తంతో భజన చేయించుకున్న విజయ్ ఇప్పుడు నోటా రిలీజ్ తర్వాత అందరిచేతా రకరకాల విమర్శలు వినాల్సి వస్తోంది.
“పెళ్లిచూపులు” , “అర్జున్ రెడ్డి”, “గీతగోవిందం”తో స్టార్ అయిపోయిన … విజయ్ దేవరకొండ కు ఈ సినిమా ప్లాఫ్ పెద్ద విషయమేమీ కాదు. కెరీర్ పరంగా కూడా పెద్ద నష్టమేమీ కాదు. కానీ మీడియా మాత్రం …విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందంటూ రాసేస్తున్నారు.
ఈ చిత్రం ప్రభావం విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా “ట్యాక్సీవాలా” పై పడుతుందని అంటున్నారు.మరో ప్రక్క “డియర్ కామ్రేడ్” కూడా కొత్త దర్శకుడితో చేస్తున్నదే. ఆ సినిమా తేడా కొడితే అంతే అని అప్పుడే నోటికొచ్చింది రాసేస్తున్నారు. ఏదో ఒక సినిమా తేడా కొట్టి ఉండచ్చు కానీ ప్రతీ సినిమా అలా ఎందుకు అవుతుంది. దానికి తోడు విజయ్ అంత తెలివితక్కువ వాడు కాదు కదా..తనువేసుకున్న పునాదిని తనే కూలగొట్టడానికి…ఏమంటారు.