HomeTollywoodత‌రుణ్ భాస్క‌ర్ హీరోయిన్‌ని ప‌డ‌క‌గ‌దికి ర‌మ్మన్నారా?

త‌రుణ్ భాస్క‌ర్ హీరోయిన్‌ని ప‌డ‌క‌గ‌దికి ర‌మ్మన్నారా?

టాలీవుడ్‌లో మీటూ ఉద్య‌మం శ్రీ‌రెడ్డీ కార‌ణంగా తానా స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ను కూడా ఓ ఊపు ఊపేసింది. ఇటీవ‌ల కొంత వ‌ర‌కు సైలెంట్ అయిపోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై త‌మిళ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త‌ను కూడా కాస్టింగ్ కౌచ్‌కి గుర‌య్యాన‌ని, హీరో కూతురిని అయినా త‌న‌కు ఈ వేధింపులు త‌ప్ప‌లేద‌ని చెప్ప‌డంతో మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.

వ‌న్ బై వ‌న్ మ‌ళ్లీ త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ని బ‌య‌ట‌పెడుతున్నారు. తాజాగా త‌రుణ్‌భాస్క‌ర్ హీరోయిన్ వాణిభోజ‌న్ కూడా త‌ను కాస్టింగ్ కౌచ్‌కు గుర‌య్యాన‌ని వెల్ల‌డించింది. వాణి భోజ‌న్ ఇటీవ‌ల త‌రుణ్‌భాస్క‌ర్ హీరోగా న‌టించిన `మీకు మాత్రమే చెప్తా` చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌ని ఓ నిర్మాత అవ‌కాశం కోసం ఏకంగా ప‌డ‌క గ‌దికే ర‌మ్మ‌న్నాడ‌ని వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అంతే కాకుండా చాలా మంది నిర్మాత‌లు త‌న మేనేజ‌ర్‌ని డైరెక్ట్‌గా అడిగార‌ని, మీ మేడ‌మ్ ప‌డ‌క‌గ‌దికి వస్తే ఇప్పుడే కొత్త సినిమా బుక్ చేస్తాన‌ని అన్న‌ట్టు తన‌కు తెలిసింద‌ని, వాళ్ల గురించి చెప్ప‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్ప‌డంతో కోలీవుడ్‌లో మ‌ళ్లీ మీటూ వివాదం రాజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News