అర్జెంటుగా ఇంకో ‘అర్జున్ రెడ్డి’ కావలెను.!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సింగిల్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అనూహ్యంగా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో, సెన్సేషనల్ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రౌడీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రేజ్‌తో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు అతి తక్కువ టైమ్‌లోనే విజయ్ దేవరకొండ. అయితే, ‘లైగర్’ సినిమా బెడిసికొట్టడంతో రౌడీతో సినిమా అంటే అదో పెద్ద రిస్క్ అనే అభిప్రాయానికి వచ్చేశారు తెలుగు మేకర్లు.

విజయ్ దేవరకొండ కెరీర్‌లో ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ ‘గీత గోవిందం’. ఈ కాంబినేషన్‌లో ‘గీత గోవిందం 2’ తెరకెక్కించాలని సేమ్ డైరెక్టర్ పరశురామ్‌తో ఈ మధ్యనే ప్రాజెక్ట్ సెట్ అయినట్లే అయ్యింది. కానీ, దిల్ రాజు, అల్లు అరవింద్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ నలిగిపోయి యవ్వారం చెడినట్లే కనిపిస్తోంది.

దాంతో, అర్జున్ రెడ్డి లాంటి సినిమా కోసం తిరుగుతున్నాడట విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం 2’ బెడిసికొట్టడంతో, అర్జున్ రెడ్డి పైనే విజయ్ ఆశలన్నీ. అయితే, అలాంటి హిట్ ఇచ్చే దర్శకుడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు.? స్నేహితుడు తరుణ్ భాస్కర్‌తో విజయ్ సంప్రదింపులు జరుపుతున్నాడట. ఓన్ ప్రొడక్షన్ అయినా ఓకే అనేంత వరకూ వచ్చాడట. చూడాలి మరి, రౌడీ ‘అర్జున్ రెడ్డి 2’ ఆశలు ఎంత మేర ఫలిస్తాయో.!