తరుణ్ భాస్కర్ తో వెంకీ సినిమా

వయసు పెరుగుతున్నా యువ నటులతో మల్టీ స్టారర్లు, ఆ పైన తన వయసుకు తగ్గ పాత్రలతో సినిమాలు చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ క్రమంలోనే ‘గురు’ సినిమా చెప్పుకోవచ్చు. తాజాగా మేనల్లుడు నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు.

తాజాగా వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో సినిమా చేయనున్నాడు. గుర్రప్పందాలు నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ఈ సినిమాకి సంబన్హదించిన పూర్తి వివరాలు మరి కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.

తరుణ్ భాస్కర్ చిత్రాలు అందులోని పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ క్రమంలో అతను వెంకటేష్ ను ఎలా చూపిస్తాడా అని అభిమానులు అనుకుంటున్నారు. మరో పక్క ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాథరావు నక్కిన తో వెంకటేష్ మరో చిత్రం ఉంటుంది.