డిజాస్ట‌ర్ నుంచి బ‌న్నీ గ్రేట్ ఎస్కేప్!

బ‌న్నీపై లోలోన మ‌రిగిపోతున్నార‌ట‌!

బ‌న్నీ భారీ డిజాస్ట‌ర్ నుంచి జ‌స్ట్ ఎస్కేప్ అయ్యాడ‌ని తెలిసింది. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా ఫ్లాప్‌తో అల్లు అర్జున్‌కు మ‌రో సినిమా చేయ‌డానికి 18 నెల‌ల గ్యాప్ వ‌చ్చింది. ఆ గ్యాప్ తీసుకుంది కాదు.. ఎలాంటి సినిమా చేయాల‌న్న సందిగ్దంలో బ‌న్నీ తీసుకున్న గ్యాప్ అది. ఆ గ్యాప్‌లో అల్లు అర్జున్ మ‌రో ఫ్లాప్ ని మిస్స‌య్య‌డ‌ట‌. ఇటీవ‌ల మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `డిస్కోరాజా` భారీ డిజాస్టర్‌గా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

మాస్ మ‌హారాజా కంటే ముందు ఈ క‌థ బ‌న్నీ ద‌గ్గ‌రికి వెళ్లింద‌ట‌. అయితే క‌థ‌లో చాలా మార్పులు అవ‌సరం గ్ర‌హించిన బ‌న్నీ అవ‌న్నీ చేసుకుని వ‌చ్చి క‌నిపించ‌మ‌ని, మ‌రోసారి మార్పుల‌తో క‌థ వినిపించ‌మ‌ని ద‌ర్శ‌కుడు వి.ఐ. ఆనంద్‌కు చెప్పాడ‌ట‌. అది న‌చ్చ‌ని వి.ఐ.ఆనంద్ అదే క‌థ‌ని మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు వినిపించ‌డం, అత‌ను వెంట‌నే ఓకే చెప్పడం చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన‌ట్టు తెలిసింది. ఇదే క‌థ బ‌న్నీ చేసి వుంటే `డిస్కోరాజా` బ‌న్నీకి మ‌రో డిస్కో అయ్యేద‌ని, అప్పుడు కెరీర్ మ‌రింత ప్ర‌మాదంలో ప‌డేద‌ని చెబుతున్నారు. ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా డిజాస్ట‌ర్ నుంచి బ‌న్నీ జ‌స్ట్ ఎస్కేప్ అని అవాక్క‌వుతున్నార‌ట‌.