ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెన్షన్ లో ఉన్నారని సోషల్‌మీడియాలో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు విషయమేమిటంటే… ఆయన బాబాయ్ కి ఆరోగ్యం అసలు బాలేదని సమాచారం. బాబాయ్ అంటే నందమూరి వంశానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటారేమో కాదు కాదు…బాలకృష్ణనో, రామకృష్ణనో అనుకునేరు కాదు ఈయన తల్లి తరపు బంధువు అట. పిన్ని భర్త అయిన ఆయన ..ఎన్టీఆర్ ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంటూ, ఎత్తుకుని పెంచాడట. ఇప్పుడు ఆయన ఆరోగ్యమే విషమంగా ఉందని అందుకే ఆయన టెన్షన్ లో ఉన్నాడని కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచురించాయి.
ఆయనను ప్రస్తుతం బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చేర్చారని ఆయన ఆరోగ్యం అసలు బాలేదని, పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. దాంతో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆ తర్వాత హాస్పటల్ అంటూ ఆయన చుట్టే తిరుగుతున్నాడట. నిజానికి గతేడాది లోనే తండ్రిని పోగొట్టుకున్నాడు ఎన్టీఅర్. అందుకే ఈయన విషయంలో అంత టెన్షన్ పడుతున్నట్టు, చెబుతున్నారు. నిజానికి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడివురా చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను పిలిచి సినిమాకి హైప్ క్రియేట్ చేయాలని అనుకున్నప్పటికీ ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను కాకుండా మరో పెద్ద హీరోతో ఆ వేడుక జరిపించాలని చిత్ర యూనిట్ చూస్తున్నట్లు చెబుతున్నారు. దీని మీద మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇక మరి పాపం కళ్యాణ్‌రామ్ ఏం చేస్తాడో ఏంటో.