Home Tollywood జ‌క్క‌న్న స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడా?

జ‌క్క‌న్న స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడా?

`బాహుబ‌లి` త‌రువాత జ‌క్క‌న్న రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రంలో క్రేజీ స్టార్స్ రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌కి వ‌స్తుందా? అని యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. జ‌న‌వ‌రి 1న ఈ సినిమా పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నాం అంటూ `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ ప్ర‌క‌టించేసింది.
జ‌న‌వరి 1 నుంచి `బాహుబ‌లి` త‌ర‌హాలో వ‌రుసగా ఒక్కో పండ‌క్కి ఒక్కో లుక్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు చిత్ర బృందం స్పందించి అదే ప‌నిలో వున్నామంటూ చిన్న హింట్ ఇచ్చేసింది. #yaerofRRR లేదా #HappyRRR year ట్యాగ్‌ల‌ని ట్రెండ్ చేసి 2020కి స్వాగ‌తం చెబుదామ‌ని ఫ్యాన్‌ని ఉద్దేశిస్తూ రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే టీమ్ మాత్రం #HappyRRR year 2020 అని పాత స్టిల్‌కు కొత్త అక్ష‌రాల‌ని జోడించి న్యూ ఇయ‌ర్ రోజు ఉద‌యం విడుద‌ల చేయ‌డం ఫ్యాన్స్‌ని అస‌హ‌నానికి గురిచేస్తోంది.   మ‌రీ ఇంత దారుణ‌మా? అని వాపోతున్నారు.

బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కైనా రాజ‌మౌళి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడా? అన్న‌ద తెలియాల్సి వుంది. ఎన్టీఆర్ కొమ‌రం భీంగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలియాభ‌ట్‌, హాలీవుడ్ న‌టి ఒలివియా ఇందులో హీరోయిన్‌లు గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో అజ‌య్ దేవ్‌గ‌న్‌, హాలీవుడ్ న‌టులు రే స్టీవెన్‌స‌న్‌, అలిస‌న్ డూడీ క‌నిపించ‌బోతున్నారు. 2020 జూలై 30 ప్ర‌పంచ వ్యాప్తంగా 10 భార‌తీయ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

Related Posts

‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే...

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం...

Latest News