Home Tollywood ‘జాను’ డైరక్టర్ కు ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్

‘జాను’ డైరక్టర్ కు ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్

‘సాహో’ ఎఫెక్ట్ ..ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సాహో సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. విజువల్ గా బాగున్నా ఎమోషన్స్ లేని సినిమా అంటూ కామెంట్స్ వచ్చాయి. దాంతో ప్రభాస్ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు.

ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను కూడా యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ప్రేమకథ అని తెలుస్తుంది. అందుకే ఈ మూవీకి టైటిల్ గా జాను అని పెట్టబోతున్నారట. జాను అంటే డార్లింగ్ అని అర్ధం. ప్రభాస్ డార్లింగ్ సినిమా మంచి హిట్ అయ్యింది ఆ క్రమంలో జానుకి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ సాహోకు ఏ తప్పు జరిగిందో అది రిపీట్ కాకూడదని ప్రభాస్ భావిస్తున్నారట. అందుకోసం కొంచెం గట్టిగానే డైరక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన తరహాలో సూచనలు ఇచ్చారట. 

అందుతున్న ఇన్ సైడ్ ఇన్ఫో ప్రకారం ప్రభాస్ ..జాను దర్శకుడుని పిలిచి …స్క్రిప్టుని రీరైట్ చేయమని అన్నారట. ఎమోషన్స్ ని కథలో కలపమని, కేవలం విజువల్ గా బాగుంటే సరిపోదని ఆర్డరేసారట. అలాగే ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే నడవాలని అన్నారట. ఆ రోజు ఓకే చేసిన స్క్రిప్టు సాహో దెబ్బకు పూర్తిగా మారిపోతోందని దర్శకుడు బాధపడినా హీరో ఆదేశించాక చేసేదేముంది. దాంతో ఇప్పుడు జాను దర్శకుడు పూర్తిగా స్క్రిప్టుని రీరైట్ చేయటంలో మునిగితేలుతున్నాడట. ఇదంతా చూస్తూంటే మొత్తానికి ప్రభాస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.

- Advertisement -

Related Posts

తెగ కష్టపడుతోంది.. సమంత వర్కవుట్లు వైరల్

సమంత తన ఫిట్ నెస్‌కు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో అందరికీ తెలిసిందే. వర్కవుట్లు చేయనిదో రోజును మొదలుపెట్టదు. ఒక వేళ ఉదయం చేసేందుకు కుదరకపోయినా రాత్రి అయినా సరే వర్కవుట్లు చేస్తుంది. అలా...

కూతురి ఫ్రెండ్ పార్టీ.. పబ్‌లో సురేఖా వాణి రచ్చ

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి అని కాకుండా ఆమె కూతురు సుప్రిత కూడా దుమ్ములేపుతూ ఉంటుంది. తల్లీ కూతుళ్లు...

ఈ సారి హిట్ పక్కా.. నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్ వైరల్

యంగ్ హీరో నాగ శౌర్య ఓ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందుకోసం రకరకాల పాత్రలను, కథలను ఓకే చేస్తున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లోపెట్టేశాడు. ప్రస్తుతం నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. లక్ష్య...

ఫుల్లుగా తగ్గించేందుకు రెడీ.. శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ వర్కౌట్లు

శ్రీముఖి, విష్ణు ప్రియల స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై యాంకర్లుగా ఉన్న వీరు చివరకు ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. యాంకరింగ్‌లో శ్రీముఖి కాస్త సీనియరే అయినా కూడా విష్ణు ప్రియ...

Latest News