తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు యాక్టివ్ ప్యానెల్ పై సి.కళ్యాణ్ మన ప్యానెల్ నెగ్గింది. 1438 మంది సభ్యులు ఓట్లు వేయగా.. అందులో 20 మంది సెక్టార్ సభ్యుల్లో 16 మంది మన ప్యానల్
ను గెలిపించారు. నలుగురు యాక్టివ్ ప్యానల్
నుంచి విజయం సాధించారు. 12 మంది ఈసీ సభ్యుల్లో 9 మంది సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి గెలుపొందారు. దిల్ రాజు, దామోదర ప్రసాద్ మినహా యాక్టివ్ ప్యానెల్ సభ్యులంతా ఓటమి పాలయ్యారు. మోహన్ గౌడ్ ఇండిపెండెంట్‌గా గెలిచారు.
గెలిచిన ప్యానెల్ 2019-21 సీజన్ కి పాలన బాధ్యతల్ని చేపట్టనుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుస్తామని ధీమాను కనబరిచిన దిల్ రాజు తన ప్యానెల్ ని గెలిపించుకోవడంలో ఓటమి పాలవ్వడంపై ఆసక్తిగా మాట్లాడుకున్నారంతా. ఆయనకు భంగం వాటిల్లిందని.. అంటే సపరేట్ ఎల్.ఎల్.పి కుంపటితో బయటకు వెళ్లి నిర్మాతల గిల్డ్ గా మారిన వాళ్ల పై ఇది పెద్ద పంచ్ అంటూ మాట్లాడుకున్నారు. ఇక ఈ ఎన్నికలు చాంబర్ లోని నాలుగు విభాగాలకు సంబంధించినవి. నిర్మాతలు, స్టూడియో ఓనర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. వీళ్లలో ఈసారి ఎగ్జిబిటర్ విభాగానికి అధ్యక్ష పదవి అవకాశం దక్కింది. ప్రతి
రెండేళ్లకు ఒక్కో విభాగం నుంచి ఒకరు చాంబర్ అధ్యక్షులు అవుతారు. ఈసారి ఎగ్జిబిటర్స్
విభాగం నుంచి నారాయణ దాస్ నారంగ్‌ను ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎనిమిది గంటలకు ఎలక్షన్ మొదలైతే ఒంటిగంటకు పూర్తయింది. సాయంత్రానికి రిజల్ట్ వెలువడింది. సి.కళ్యాణ్ తో పాటుగా గెలిచిన బృందంలో ప్రసన్నకుమార్, నట్టికుమార్ ప్రభృతులు ఉన్నారు.