`గజిని`.. 2005లో వచ్చిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సూర్యని హీరోగా నిలబెట్టింది. తెలుగులో ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్ రీమేక్ చేయాలని ముచ్చటపడినా హీరో సూర్య డబ్బింగ్ మాత్రమే చేస్తామని, రీమేక్ రైట్స్ అమ్మనని నిర్మాత దగ్గర మాట తీసుకున్నారట. దాంతో పవన్ వెనక్కి తగ్గడం, గీత ఆర్ట్స్ ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయడం జరిగింది. ఆ కృత్ఞతతో సూర్య ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మెగా ఫ్యామిలీలో మాట్లాడకుండా వెళ్లడంట.
అయితే ఆ తరువాత ఇదే చిత్రాన్ని అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి ఆమీర్‌ఖాన్‌తో రీమేక్ చేసి వంద కోట్ల క్లబ్ లెక్కలకు తొలి సారి నాంది పలికారు. ఇప్పడు ఇదే చిత్ర టైటిల్‌ని `గజిని-2` పేరుతో గీతా ఆర్ట్స్ కు సంబంధించిన బన్నీవాసు ఇటీవల ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. తాజాగా అది బయటికి వచ్చింది. ఇంతకీ గీతాలో `గజిని-2` ఎవరి కోసం అనే రచ్చ మొదలైంది. ఇంతకీ ఈ టైటిల్ ఎవరికోసమా అని ఆరాతీస్తే బన్నీ కోసం అని తెలిసింది.
త్వరలో ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఇటీవల బన్నీ వాసు మీడియాకు చెప్పేశాడు. అతనే ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడు కాబట్టి ఈ సినిమా కోసమే `గజినీ-2` టైటిల్‌ని రిజిస్టర్ చేయించారని ప్రచారం జరుగుతోంది. `దర్బార్` డిస్ట్రిబ్యూటర్ల కారణంగా తలనొప్పులు ఎదుర్కొంటున్న మురుగదాస్ గత కొన్ని రోజులుగా బన్నీకి సంబంధించిన స్క్రిప్ట్ కోసం కసరత్తులు చేస్తున్నాడట. సుకుమార్ సినిమా కొంత భాగం పూర్తి కాగానే ఈ సినిమాని తెరపైకి తీసుకొచ్చారట. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది.