ఇదేమిటి చిత్రంగా ఉండే అనుకుంటున్నారా. అసలు ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటారు ప్రేక్షకులు. అందుకే ఆ పేరును తీసుకోవడానికి కొద్దీ మార్పుతో నానీ గ్యాంగ్ లీడర్ అని తన కొత్త సినిమాకి పేరు పెట్టుకున్నాడు మన నాచురల్ స్టార్ నాని.
నిన్న చిరు పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయనకీ శుభాకాంక్షలు తెలుపుతూ తన సినిమా కొత్త పోస్టర్ ఒకటి విడుదల చేసింది. ఈ సినిమాలో నాని సరసన ఒక కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదల అయిన ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా వచ్చే నెల 13 న విడుదల అవుతుంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.