కొత్త దర్శకుడితో శ్రీ విష్ణు సినిమా

విభిన్నమైన సినిమాలు చేసే హీరో శ్రీ విష్ణు. అతని గత చిత్రాలు అతని అభిరుచిని తెలుపుతాయి. అతని నటనకు అతని కధా ఎంపిక నచ్చే అతనికి అభిమానులు అయ్యారు ప్రేక్షకులు. ప్రస్తుతం ‘బ్రోచేవారెవరురా’ తరువాత మరోసారి ఒక కొత్త దర్శకుడితో పని చేయనున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నారు. హసిత్ గోలి ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇతను వివేక్ ఆత్రేయ తో దర్శకత్వ శాఖలో పని చేసాడు. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్దీ రోజుల్లో తెలియనున్నాయి.