Sri Vishnu: శ్రీ విష్ణు, కార్తీక్ రాజు, #SV18 టైటిల్ #సింగిల్, హిలేరియస్‌ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ది కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ బ్యాక్! డిఫరెంట్ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ఎంటర్టైన్మెంట్ ని అందించే హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం తన #SV18 మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పిస్తోంది. నిను వీడని నీడను నేనే ఫేం కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి #SV18 చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర టైటిల్‌ను హిలేరియస్ పోస్టర్, ఆసక్తికరమైన గ్లింప్స్ ద్వారా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో శ్రీ విష్ణు రిబెలియస్ లుక్‌లో, ఒక చేతిలో మ్యూజిక్ సిస్టం, మరొక చేతిలో దీపావళి క్రాకర్ పట్టుకుని రావడం ఆకట్టుకుంది.

35 ఏళ్ల వయసులో కూడా తాను ఎందుకు ఒంటరిగా ఉన్నాడో హిలేరియస్ గా వివరిస్తూ వెన్నెల కిషోర్ డైలాగ్ తో టైటిల్ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. శ్రీ విష్ణు వాలెంటైన్స్ డే రోజున ఒక పార్కులోకి మ్యూజిక్ సిస్టమ్, క్రాకర్ కాల్చడం వంటి సన్నివేశాలు అలరిస్తాయి. అతను రెడ్ బెలూన్లు పేల్చడం, అతని చుట్టూ ఉన్న జంటలను అప్సెట్ అవుతారు. ఆసక్తికరంగా, ఇద్దరు వేర్వేరు అమ్మాయిలు అతన్ని ప్రేమిస్తున్నప్పటికీ, అతను ఒంటరిగా ఉండటం, సినిమా టైటిల్ #సింగిల్ అని రివిల్ అవ్వడం క్యురియాసిటీ పెంచింది.

పోస్టర్, గ్లింప్స్, టైటిల్ యుత్ ఫుల్ గా వున్నాయి. శ్రీ విష్ణు స్టైలిష్ మేకోవర్ ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ హీరోయిన్లు కేతికా శర్మ, ఇవానా పరిచయమయ్యారు.

నేపథ్యంలో ఒంటరి వాడిని అనే టైమ్‌లెస్ పాట ఉంది, ఇది సన్నివేశానికి ఒక ఫన్నీ ఎలిమెంట్ ని జోడిస్తుంది. ఆర్ వేల్‌రాజ్ విజువల్స్ కలర్‌ఫుల్‌గా, డైనమిక్‌గా ఉన్నాయి, విశాల్ చంద్ర శేఖర్ సంగీతం ఉత్సాహంగా మరింత పెంచింది. ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తుండగా, చంద్రిక గొర్రెపాటి ఆర్ట్ డైరెక్టర్.

హిలేరియస్ టైటిల్ గ్లింప్స్‌తో, #Single ఫన్ ఫుల్ రోలర్‌కోస్టర్ రైడ్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది.

నటీనటులు: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి
బ్యానర్లు: గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
డిఓపి: ఆర్ వెల్‌రాజ్
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
డైలాగ్స్: భాను భోగవరపు & నందు సవిరిగాన
ఆర్ట్: చంద్రికా గొర్రెపాటి
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
డైరెక్షన్ టీం: రామ నరేష్ నున్న, ప్రసన్న నెట్టెం, శంకర్ కొత్త, సాయి కిరణ్ కట, సువర్ణ సుంకరి, సందీప్ హర్ష, సుబ్బారెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట
మ్యూజిక్ ఆన్: ఆదిత్య మ్యూజిక్

జగనన్న నన్ను క్షమించు || Vishwak Sen Sorry To YS Jagan On Behalf Of Prudhvi Raj | Boycott Laila | TR