కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టబెట్టేస్తోంది. భారత్ పరిస్థితి కొంత ఓకే కానీ పెను ప్రమాదం పొంచి ఉందని అర్థమవుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య..మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం ఎంత పటిష్టంగా చర్యలు తీసుకున్నా కేసులు మాత్రం తగ్గు ముఖం పట్టలేదు. వ్యాక్సిన్ లేని కరోనా ఊపిరాడకుండా చేస్తోంది. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ముగుస్తుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ ఎత్తేయకపోతే ఒక సమస్య? ఎత్తితే ఉపద్రవంలా ముంచుకొస్తున్న మహమ్మారీ. ఇలా రకరాకల సందేహాలతో దేశం గడగడలాడిపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు కాస్ట్ లీ సెలబ్రిటీలు కరోనా బారిన పడి కన్నుమూసారు. దీంతో సామాన్యుల్లో అంతకంతకు టెన్షన్ పెరుగుతోంది.
కారణం ఏదైనా.. చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో..ఇంకొంత మంది హోమ్ క్వారంటైన్ లో ఉండి.. గది దాటి బయటికి రావడం లేదు. తాజాగా మణిరత్నం-సుహాసినీల గారాల పుత్రుడు నందన్ కూడా హోమ్ క్వారైంటైన్ లో ఉన్న సంగతి ఇటీవలే ఓపెనైంది. నందన్ మార్చి 18న లండర్ నుంచి వచ్చాడు. ఎయిర్ పోర్టులో పరీక్షలు అనంతరం ఎలాంటి పాజిటివ్ రిపోర్టులు లేకపోవడంతో నేరుగా ఇంటికి చేరుకున్నాడు. అయినా ఒకవేళ కరోనా సోకితే పరిస్థితి ఏంటని భావించి ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడుట. సుహాసిని ఒక్కరే బిడ్డను దూరంగా ఉండి చూసుకుంటున్నారుట. నందన్ ని మణిరత్నం కానీ.. అమ్మమ్మ తాతయ్యలు కానీ అస్సలు కలవనూ లేదు.. తనని చూడనేలేదుట. ఒకవేళ చూస్తే ప్రేమను అదుపు చేసుకోలేక ఆప్యాయంగా కౌగిలించుకుంటారు అన్న కారణంగా నందన్ దూరంగా ఉన్నట్లు సహాసిని వెల్లడించారు. తాతయ్య వయసు 90.. అమ్మమ్మ వయసు 75 కాబట్టి దూరం పాటించాల్సి వస్తుందని..వైరస్ సోకితే వాళ్ల పరిస్థితి ఏంటని భయపడే ఇంట్లో కఠినంగా వ్యవరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సుహాసిని సామాజిక దూరం పాటించాలని సెలవిచ్చారు.
అదంతా సరే కానీ… కొడుకు క్వారంటైన్ లో ఉంటే.. ప్రస్తుతం ఏ చీకూ చింతా లేకుండా ఎయిటీస్ స్టార్స్ లో తన స్నేహితురాళ్లతో సుహాసిని ట్వీట్ ముచ్చట్లాడుతున్న వైనం బయటపడింది. తన గ్రేట్ ఫ్రెండ్ రేవతి.. రమ్యకృష్ణ .. సుమలత తదితరులతో నిరంతరం కరోనా ముచ్చట్లాడుతూ .. ఇతర సంగతులపైనా మాటా మంతీ కలిపేస్తూ బాగానే ఎంటర్ టైన్ అవుతున్నారు సుహాసిని. ఇక తన కజిన్స్ లో రమ్య ఇల్లు ఊడ్చే వీడియో ఒకటి సుహాసిని షేర్ చేయగా.. అది కాస్తా ప్రస్తుతం జెట్ స్పీడ్ తో వైరల్ గా మారింది.