కెజీఎఫ్ హీరో కోసం పూరి పాట్లు

పూరి జగన్నాధ్ హిట్ కొట్టి ఐదేళ్లు అయిపొయింది. మొత్తానికి ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్ దక్కించుకున్నాడు. దాంతో మళ్ళీ ఆయన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ పై కొత్త ఆశలు చిగురించాయి. ఒకప్పుడు మహేష్ కు చెప్పిన ఈ కధ, ఆయన స్క్రిప్ట్ నచ్చక వదులుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ పూరి దానిని దుమ్ము దులిపి హీరోలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా కెజీఎఫ్ సినిమాతో పెద్ద స్టార్ అయిన యాష్ కు. తాజా సమాచారం మేరకు పూరి యాష్ ను కలిసి కధ చెప్పాడని తుది స్క్రిప్ట్ చూసి యాష్ నిర్ణయిస్తాడని వినికిడి.

ఒకవేళ ఒప్పుకుంటే, పూరి దీనిని బహు భాషల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే దాకా పూరి కలల ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని చెప్పలేం.