ఓంకార్ ఎక్కువ ఊహించుకుంటున్నాడా?

వారంలో రిలీజ్…ప్రమోషన్స్ ఏవి

‘రాజుగారిగది, రాజుగారి గది2’ చిత్రాల తర్వాత ఓంకార్‌ దర్శకత్వంలో ‘రాజుగారి గది3’ రాబోతున్న సంగతి తెలిసిందే. అశ్విన్‌బాబు, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రం షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 18న రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. ఇంకా రిలీజ్ కు ఎంతో టైమ్ లేదు. అయినా ఎక్కడా ప్రమోషన్స్ ఊపందుకున్నట్లు కనపడటం లేదు. కేవలం వారం రోజుల్లో ఎంత మేరకు ప్రమోట్ చేయగలుగుతారు అనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది.

ఇప్పటికి చాలా మందికి ఈ సినిమా వస్తోందని తెలియదు. పోనీ సినిమాలో స్టార్స్ ఉన్నారా అంటే అదీ లేదు. అవికాగోర్ ఇప్పుడున్న సిట్యువేషన్ లో థియోటర్స్ కు జనాలకు లాక్కొచ్చే పరిస్దితి లేదు. కేవలం ఓంకార్ పేరు చెప్పాలి. అలాగే గత రెండు చిత్రాలు పేర్లు చెప్పి ప్రమోట్ చెయ్యాలి. మరి ఓంకార్ కు ఏం నమ్మకమో తెలియటం లేదంటున్నారు. చాలా మంది ఓంకార్ తనను తాను ఎక్కువ ఊహించుకుని తన సినిమాకు పెద్దగా ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్తున్నారు.

దర్శక, నిర్మాత ఓంకార్‌ మాట్లాడుతూ.. ‘రాజుగారి గది’ సినిమాను చేసేటప్పుడు ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ రిలీజ్ తర్వాత దాని దశ మారిపోయింది. బిజినెస్‌ అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే విధంగా అనిపిస్తోంది. వినూత్నమైన అంశంతో థ్రిల్‌ కల్గించేవిధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

షబీర్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది.

వికా గోర్ సినిమాలో డిఫరెంట్ లుక్ లో నటిస్తోంది.అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్‌, అజయ్‌ ఘోష్‌, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.