ఒకప్పుడు ప్రేమికులం, ఇప్పుడు స్నేహితులం – హన్సిక

ఒకప్పుడు ప్రేమికులం, ఇప్పుడు స్నేహితులం - హన్సిక

వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన వారంతా ఆ త‌రు‌వాత ఫేడ‌వుట్ కావ‌డంతో వెబ్‌సిరీస్‌ల బాట‌ప‌డుతున్నారు. అక్క‌డ సెకండ్ ఇన్నింగ్సిని ప్రారంభిస్తున్నారు. డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ ఎక్కువైపోవ‌డంతో ఈ త‌ర‌హా న‌టీన‌టుల‌కు చేతినిండా వెబ్ సిరీస్‌లుంటున్నాయి. వెండితెర‌పై ఆక‌ట్టుకోలేక‌పోయిన తేజ‌స్వి లాంటి వాళ్లు వెబ్ బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఇదే త‌ర‌హాలో క్రేజీ భామ హ‌న్సిక కూడా వెబ్ సిరీస్‌ల‌నే న‌మ్ముకుంటోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి పేరు తెచ్చుకున్న హ‌న్సికకు ఒక ద‌శ‌లో త‌మిళ తంబీలు గుడి కూడా క‌ట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ ప్ర‌స్తుతం సీన్ మారింది. హార‌ర్ చిత్రాల్లో న‌టిస్తూ త‌మిళంలో అర‌కొర అవ‌కాశాల‌తో కాలం వెల్ల‌దీస్తోంది. హ‌న్సిక ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది.

`న‌షా` అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్‌లు వుంటుంద‌ట‌. ఇదొక హార‌ర్ థ్రిల్ల‌ర‌ని హ‌న్సిక త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా వెల్ల‌డించింది. అంతేనా మాజీ ప్రియుడు శింబు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పుకొచ్చింది. త‌ను ఇప్పుడు మంచి స్నేహితుడ‌ని, ఇద్ద‌రం స్నేహితులుగా మారితే త‌ప్పేంట‌ని, ప్ర‌స్తుతానికి త‌న‌కు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచ‌న లేద‌ని, ఆ ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు మాత్రం త‌ప్ప‌కుండా అంద‌రితో షేర్ చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది.