ఎన్టీఆర్ బయోపిక్ లో నాగబాబు చెయ్యనన్నాడా ?

అవునని అంటున్నారు . ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో  ఓ పాత్ర కోసం నాగబాబును సంప్రదించారట. కానీ నాగబాబు నుంచి నేను  చెయ్యను , నా కిష్టం లేదు అనే సమాధానం వచ్చిందట . ఈ విషయం బాలకృష్ణకు చెబితే  సరే వేరే వారిని సంప్రదించామని చెప్పాడట .

బాలకృష్ణ సినిమా అనగానే ఎవరైనా చేస్తామని ముందుకు వస్తారు , అదీ ఎన్టీఆర్ బయోపిక్ లో. మరి నాగ బాబు ఎందుకు చెయ్యమన్నాడు ?

ఇందుకు రాజకీయమే ప్రధాన కారణం అంటున్నారు . పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి చంద్ర బాబు మీద , లోకేష్ మీద విమర్శలు చేస్తున్నాడు , రాజకీయంగా వారిని టార్గెట్ చేస్తున్నాడు . అలాంటప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో చేయడం తనకి ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశ్యం తోనే చెయ్యనన్నట్టు తెలిసింది .

ఆ మధ్య పవన్ ఓ చాన్నెలకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఎవరో తెలియదని అన్నాడని  వైరల్ అయ్యింది . నాగ బాబు కావాలనే అలా అన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు .

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు నాగ బాబు 25 లక్షలు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు . పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ప్రత్యక్షము గా  పరోక్షంగా అండగా వుంటున్నారు . తెలుగుదేశం పార్టీకి , బాలకృష్ణకు కావాలనే మెగా ఫ్యామిలీ దూరంగా వుంటుందట .