HomeTollywoodఆర్ ఆర్ ఆర్ కి సాధ్యంకాక‌పోతే పుష్ప‌కి సాధ్యం కాదా?

ఆర్ ఆర్ ఆర్ కి సాధ్యంకాక‌పోతే పుష్ప‌కి సాధ్యం కాదా?

లాక్ డౌన్ దెబ్బ‌కి పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` వాయిదా ప‌డ‌టం ఖాయ‌మ‌నే సంకేతాలు అందుతున్నాయి. నిర్మాత దానయ్య ఎంత బ‌ల్ల గుద్ది చెప్పినా! మే 3 తో లాక్ డౌన్ ముగిసినా…మ‌ళ్లీ పొడిగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పైగా సినిమా అంటే వంద‌లాది మంది ప‌నిచేస్తారు కాబ‌ట్టి షూటింగ్ ల‌కు అనుమ‌తి అంత ఈజీ కాద‌నే వాద‌న ఫిలిం స‌ర్కిల్స్ లో బ‌లంగా వినిపిస్తోంది. ఎలా లేద‌న్నా! ప‌రిస్థితిలు య‌ధా స్థితికి రావ‌డానిని జూన్..జూలై వ‌చ్చేస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. అంటే ఈ లోపు ఎక్క‌డికి కెమెరా క‌ద‌లడానికి వీలు లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే దాదాపు నెల రోజుల నుంచి షూటింగ్ లు బంద్ అయ్యాయి. మ‌రోమూడు నెల‌లు వెయిటింగ్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

అంటే ముందుగా ప్లాన్ చేసుకున్న రిలీజ్ తేదీలు అన్నీ ఇప్పుడు మారాల్సిందే. ఆ లెక్క‌న ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బ‌డ్జెట్ సినిమా కొన్నినెల‌లు పాటు వాయిదా ప‌డ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు. 2021 జ‌న‌వ‌రి 8న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈచిత్రాన్ని రాజ‌మౌళి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసారు. అంత‌కు ముందు ఒక‌సారి వాయిదా వేయ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లో జ‌న‌వ‌రి 8కి థియేట‌ర్లోకి వ‌చ్చేయాల‌ని ప‌నిచేసారు. కానీ కొవిడ్ 19 అనూహ్యంగా విరుచుకుప‌డ‌టంతో సీన్ మారిపోయింది. ఈ నేప‌థ్యంలో జ‌క్క‌న్న సైతం ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు క‌థ‌నాలు వేడెక్కించాయి. మ‌రి దాన‌య్య గారి కాన్ఫిడెన్స్ ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. ఒక‌వేళ ఆర్ ఆర్ ఆర్ వాయిదా ప‌డితే గ‌నుక జ‌న‌వ‌రి 8 సంక్రాంతి రిలీజ్ తేదీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దిగిపోవాల‌ని చూస్తున్నాడుట‌.

ఆయ‌న క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది డిఫ‌రెంట్ జాన‌ర్ సినిమా. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే స్టోరీ. దాదాపు 70 శాతం షూటింగ్ అడ‌విలోనే ఉంటుంది. అందువ‌ల్ల షూటింగ్ డేస్ కూడా ఎక్కువ‌గానే ప‌డుతుంది. దానికి త‌గ్గ‌ట్టే సుకుమార్ షెడ్యూల్స్ వేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ వాయిదా న్యూస్ రావ‌డంతో ఆ తేదికి పుష్ఫ‌ని దించేస్తే ఎలా ఉంటుంద‌న్న మాట బ‌న్నీ-సుకుమార్ చెవిన వేసాడుట‌. కానీ సుకుమార్ ఆ మాట‌ను ఖండించిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇది స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌తీ స‌న్నివేశాన్ని జ‌క్క‌న్న లా చెక్కాల్సిన సినిమా. పైగా ఈ మూడు నెల‌లు స‌మ‌యం కూడా వృద్ధాగా పోతుంది. కంగ‌రు ప‌డితే ప‌న‌వ్వ‌దు అన్న‌ట్లు హింట్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇక పుష్ప‌ని సుకుమార్ ప్రెస్టీజియ‌స్ గా తీసుకుని చేస్తున్నాడు. పుష్ప స‌క్సెస్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పై కౌంట‌ర్ వేసేలా ఉండాలి. ఎందుకంటే ముందుగా ఈ స్ర్కిప్ట్ మ‌హేష్ ముందుకే వెళ్లింది. అక్క‌డ రిజెక్ట్ అయితేనే బ‌న్నీ వ‌ద్ద‌కు వ‌చ్చింది. కాబ‌ట్టి ఎలా ప‌బ‌డితే అలా..ఎప్పుడు ప‌డితే అప్పుడు రిలీజ్ చేసేయ‌డం క‌రెక్ట్ కాద‌ని కాస్త గట్టిగానా వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. అందువ‌ల్లే సుకుమార్ రిలీజ్ డేట్ ని కూడా ముందుగానే ప్ర‌క‌టించ‌లేద‌ని అంటున్నారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News