Home Tollywood అల‌వైకుంఠ‌పురంలో ఫ‌స్ట్ రివ్యూ... బంప‌ర్‌హిట్‌

అల‌వైకుంఠ‌పురంలో ఫ‌స్ట్ రివ్యూ… బంప‌ర్‌హిట్‌

సంక్రాంతి బ‌రిలో ఉన్న మ‌రో చిత్రం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన `అల‌వైకుంఠ‌పురంలో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో పూజాహెగ్డే, బ‌న్నీ జంట‌గా న‌టిస్తున్నారు. ఒక ఇప్ప‌టికే విడుద‌లైన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `ద‌ర్బార్‌`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`చిత్రాలు హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు ఫుల్ క్రేజ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో న‌డుస్తోంది. రేపు విడుద‌ల‌వుతున్న బ‌న్నీ `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి.

‘అల వైకుంఠపురములో’ సినిమా ఫలితం పై హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఒక మంచి సినిమాను తెరకెక్కించామని, ఇది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని వారు అంటున్నారు. పాటలు, ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ అంచనాలకు ఎక్కడా తక్కువ కాకుండా సినిమా ఉంటుందని అర్థమైపోయింది.

దీని పై ప్రముఖ సినీ విమర్శకుడు శివ సత్యం ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. నిన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ముంబైకి చెందిన సినీ విమర్శకుడు శివ సత్యం.. ఈరోజు ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి కూడా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’కి ఇచ్చినట్టే దీనికి కూడా 3.5 రేటింగ్ ఇచ్చారు. అయితే, ఈ సినిమాలో బన్నీ అంతా తానై నడిపించారని, తన భుజస్కందాల పై మోశారని ట్వీట్ చేశారు శివ సత్యం. సినిమాలో చాలా మెరిట్స్ ఉన్నాయని.. కచ్చితంగా ఎక్కవ మంది ఆడియన్స్‌కి ఈ సినిమా రీచ్ అవుతుందని పేర్కొన్నారు.

సినిమాకు ఓవరాల్‌గా మంచి రేటింగ్ 3.5 ఇచ్చిన శివ సత్యం.. చిత్రంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ రేటింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్‌కి 4 రేటింగ్ ఇచ్చారు. ఇంకా టెక్నిక‌ల్ వ్యాల్యూస్ అదుర్స్ అని తెలిపారు. త్రివిక్రమ్ దర్శకత్వానికి మంచి ప్ర‌శంస‌లు అందించారు. స్క్రీన్‌ప్లే కూడా అదిరిపోతుంది. ఇంకా మిగిలిన యాక్ట‌ర్స్ అంద‌రికీ చాలా మంచి పేరే వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అల వైకుంఠపురములో’ స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి దాటిన తరవాత నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైపోతుంది.

- Advertisement -

Related Posts

ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి.. తేజస్వీ పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న తేజస్వీ.. బిగ్ బాస్ షో వల్లే మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే...

ఎప్పుడూ విసిగించే వాడు.. వరుణ్ తేజ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మామూలుగా ఎవరెవరి బర్త్ డే‌లకు స్పెషల్‌గా విషెస్ చెబుతుంటాడు. సినీ రాజకీయ ప్రముఖులు, సన్నిహితులకు సంబంధించిన బర్త్ డేలకు...

వామ్మో మంచు లక్ష్మీ మామూల్ది కాదు.. అలా చేసేసిందేంటి?

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి మంచు లక్ష్మీ యోగా, వ్యాయామం వంటివి చేస్తుంటుంది. తానే కాకుండా అందరూ ఫాలో...

సోదరి ముందే అందాల ఆరబోతే.. పూనమ్ పిక్స్ వైరల్

పూనమ్ బజ్వా తెలుగులో ఇప్పుడు అంతగా వినిపించని పేరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం మార్మోగే పేరు. ఆ మధ్య బిగ్ బాస్ నాల్గో సీజన్ ప్రారంభం కాకముందు నిత్యం వార్తల్లో...

Latest News