విధాత ప్రొడక్షన్స్ పై ఫిల్మ్ స్టార్స్ మేకర్ సత్యానంద్ గారి సమర్పణ లో రొటీన్ చిత్రాలకు భిన్నంగా బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి. నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చక్కగా తెరకెక్కించిన చిత్రం “సాచి”. ఈ చిత్రాన్ని ఉపేన్ నడిపల్లి మరియు వివేక్ పోతగోని నిర్మాణ సారధ్యములో వివేక్ పోతగోని దర్శకుడిగా రూపొందించారు. ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ: ఆడ మగ అనే తేడా లేకుండా మన కళ్ళ మీద మనం నిలబడాలి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. కుల వృత్తికి మించిన పని లేదు అనే సిద్ధాంతం ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. దైర్యంగా ముందుకు వెళ్ళాలి అధైర్య పడి వెనకడుగు వేయకూడదు అని ఈ సాచి సినిమాలో చెప్పడం జరిగింది. సంజనా రెడ్డి (సాచి) ఒక బార్బర్ షాప్ నడుపుతూ ఉంటుంది, ఆ అమ్మాయి తండ్రి చక్రపాణి (అశోక్ రెడ్డి) అనారోగ్యంతో ఉన్నప్పుడు సాచి అన్ని తానై తండ్రికి సేవలు చేస్తుంది. అనుకోని సందర్భంలో తండ్రిని కొల్పతోంది సాచి. ఒక పిరికి అమ్మాయి మల్లిక భానవాత్ అనే యువకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంటుంది. ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి ? చివరికి సాచి ఏం చేసింది వంటి విషయాలు తెలియాలంటే సాచి సినిమా చూడాల్సిందే.
కథనం: మహిళా సాధికారతకు సంభందించిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సత్యానంద్ గారు సమర్పించగా వివేక్ పోతగోని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు.
“సాచి నిజజీవిత కథ. బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధ. మహిళా సాధికారత కు సంభందించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సంజన రెడ్డి, గీతిక రధన్ హీరోయిన్స్ గా నటించగా, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అందరూ వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు. కెవి భరద్వాజ్ సంగీత దర్శకునిగా మంచి సాంగ్స్ తో పాటు గుడ్ రీ రికార్డింగ్ చేశారు. ప్రసన్న కుమార్ పాటలు, పెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోని మాటలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, మరియు దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న వివేక్ పోతగోని తన ప్రతిభను కనబరిచారు.
సాచి సినిమా అత్యతం ఆసక్తికరంగా నడిచే సినిమా. ప్రస్తుత సమాజంలో జరిగే అన్ని అంశాలను సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. ముఖ్యంగా కులవృత్తి మించిన వృత్తి లేదు అనే పాయింట్ ను అందరికి అర్థం అయ్యే విధంగా బాగా చూపించారు.
చివరిగా: సాచి అందరిని ఆలోచింపజేసే సినిమా
రేటింగ్: 3/5