Kotabommali PS Movie Review – పులిపైనా సవారీ , కిందకి దిగనంత వరకే క్షేమం

Kotabommali PS Movie Review

కోట బొమ్మాలి మూవీ రివ్యూ – ఇక్కడ ఎలాగైనా గెలవడమే … సిస్టం కుక్కలా మారి ఎంతో కష్టపడి … రాసుకున్న రాజ్యాంగం పరిధిలోనే పని చేయాలి .. ఎక్కడో ఒక చోట ఎపుడో ఒకపుడు సిస్టం ఎవరినో ఒకరిని కరిచినా అది అనుషంగిక నష్టం లాంటిది …

నిజమెవరికి అక్కర్లేదు … అందరికి సెన్సేషన్ మాత్రమే కావాలి … కొన్ని సార్లు నిజానికి రుజువు ఉండదు … నిజమే నిస్సహాయతగా నిలిచి సాక్ష్యం చెప్పుకోవాలి …అది ఎవరు నమ్ముతారు …కోటబొమ్మాళి PS ఆ ప్రయత్నానికి ప్రతీకలా ఈ వారం వచ్చింది ..

కథ
తన వృత్తికి న్యాయం చేసే పోలీస్ .. తన పదవికి న్యాయం చేసే రాజకీయ నాయకుడు ..తన వోట్ కులానికో, డబ్బుకు అమ్ముకునే ఓటరు … వీరి మధ్య చిక్కున ముగ్గురు పోలీసుల కథ … ఈ కోటబొమ్మాళి PS

శ్రీకాంత్ :
మళ్ళీ మన శ్రీకాంత్ తన పూర్వ వైభవంతమైన నటన మనకోసం మరోసారి చూపించాడు .. ఒక ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా , ఒక FIR రైటర్ గా తన పాత్రకి చాల బాగా న్యాయం చేసాడు … కూతురి పట్ల ప్రేమ , తన వృత్తిలో జరిగే దారుణాలు తన జీవితాన్ని ఛిద్రం చేస్తుంటే శ్రీకాంత్ నటన మనకి కన్నీళ్లు తెచ్చి తీరుతుంది ..

కోట బొమ్మాళి పీఎస్‌’ పొలిటికల్ సెటైర్ కాదు.. సిస్టమ్ లో జరిగేది చూపించాం : హీరో శ్రీకాంత్

వరలక్ష్మి శరత్ కుమార్ :
ఒక పోలీస్ సిస్టం లో పూర్తిగా పావుగా మారిపోయి .. సిస్టం కి తలా వంచేసిన పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి నటన ఈ చిత్రానికి ముఖ్యమైన విషయం. ఎంత బాగుందో తన నటన … ముక్యంగా తన ముఖ కవళికలతోనే చాల సన్నివేశాలు నడిపించింది అంటే అతిశయోక్తి కాదు

మురళి శర్మ :
రాజకీయనాయకుడు… తన పదవి కాపాడుకోవటానికి ఎం చేస్తాడో… ఎలా చేస్తాడో … కళ్ళకి కట్టినట్టు చూపించాడు మురళి శర్మ … తెలుగు చలన చిత్ర సీమకి దొరికిన మరో ఆణిముత్యం అని నిస్సందేహంగా చెప్పాలి ..

ఇతర తారాగణం : శివాని రాజశేఖర్ , రాహుల్ విజయ్ , పవన్ తేజ్ కొణిదల .. బెనర్జీ … వారి వారి పరిధిలో నటించారు ..

తేజ మార్ని :
అర్జున ఫల్గుణ , జోహార్ చిత్రాల దర్శకుడు , తేజ మార్ని … కోటబొమ్మాళి PS కి చక్కగా దర్శకత్వం వహించాడు .. మలయాళ మాతృక అయిన నాయట్టు చిత్ర అనువాదమే అయినా , తెలుగు ప్రేక్షకులకి శ్రీకాంత్ మీద ఉన్న అభిమానం దృష్టిలో పెట్టుకుని , కధకి న్యాయం చేస్తూ క్లైమాక్స్ ని రాసుకున్నాడు … కచ్చితంగా మంచి దర్శకుడు అవుతాడు రానున్న రోజులలో ..

నాగేంద్ర కాసి రైటర్ గా మంచి మాటలు రాసాడు .. రంజిం రాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ఎంతో బాగా వచ్చింది , ఎన్నో సన్నివేశాలు మనల్ని టెన్షన్ పెట్టాయి .. అలాగే కన్నీళ్లు కూడా వచ్చేలా చేస్తాయి .. మిదు ముకుంధన్ “లింగిడి ” పాట బాగుంది

‘కోట బొమ్మాళి పీఎస్‌’ ఏ పార్టీని ప్రభావితం చేసేలా ఉండదు

జగదీశ్ చీకటి : కెమరామెన్ జగదీశ్ కెమెరా వర్క్ బాగుంది

మొత్తానికి :చిత్రం ఎక్కడా బోర్ కొట్టకపోయినా , ఎక్కడో చిత్రం పూర్తిగా మన మనసులకి దగ్గర కాలేకపోతోంది అనిపిస్తుంది చిత్రం చేస్తునంత సేపు , బహుశా ఇది అనువాద చిత్రం అందులోను ఒక మంచి విజయం సాధించి, OTT లో చూసేసి ఉండటం వల్లనేమో ఏది ఏమైనా కోటబొమ్మాళి PS , ఒక మంచి అనువాద చిత్రంగా మనకి మిగిలిపోతుంది .. శ్రీకాంత్, వరలక్ష్మి , మురళీశర్మ నటన , తేజ దర్శకత్వం చిత్రానికి ముఖ్యవిశేషాలు

కోట బొమ్మాలి మూవీ రివ్యూ – 3/5

 

/పవన్ దావులూరి