రివ్యూ : ‘కార్తికేయ 2’ !

Karthikeya 2 movie review

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు.

దర్శకుడు: చందూ మొండేటి
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టి జి విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని

‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ 2’ ఎలా ఉంది ?, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ సాధించింది ? అసలు ఆడియన్స్‌ ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

కథ :

కార్తికేయ (నిఖిల్) ఒక డాక్టర్ అయినా డిటెక్టివ్ లా ఉంటాడు. అర్థం కానీ సమస్యకు నిఖిల్ ఒక సమాధానంలా ఉంటాడు. ఇలాంటి కార్తికేయ తన తల్లి (తులసి)తో కలిసి ద్వారక రావాల్సి వస్తోంది. శ్రీకృష్ణుని దివ్య క్షేత్రం ద్వారకా నగరంలో కార్తికేయకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ?, ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్న కార్తికేయను ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) ఎలా తప్పించింది ?, ఇంతకీ కార్తికేయ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు?, ఇంతకీ ముగ్ధ ఎవరు ?, అసలు కార్తికేయను ద్వారకకు శ్రీకృష్ణుడు ఎందుకు రప్పించాడు ?చివరకు కార్తికేయ ఏం సాధించాడు ? ఈ మధ్యలో జరిగిన కథ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం వెండితెర పై చూడాల్సిందే.

విశ్లేషణ :

నిఖిల్ శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆదేశం కోసం ఏం సాధించాడు ? అనే కోణంలో వచ్చే అడ్వెంచర్ సీన్స్, ఎమోషన్స్ అలాగే హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఈ హిస్టారికల్ ఎంటర్ టైనర్ విజువల్స్ పరంగా కూడా బాగా ఆకట్టుకుంది. కథనం పరంగా కూడా సినిమాలో కొత్తధనం ఉంది. ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి.

పైగా దర్శకుడు చందు సినిమాను ఆసక్తికరమైన విజువల్స్ తో నడిపాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మలుపులు, మరియు ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలిచాయి. సినిమాలో నిఖిల్ క్యూరియాసిటీ టైమింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చక్కటి హావభావాలతో చాలా బాగా నటించింది.

అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష, సత్య, తులసి అలాగే మిగిలిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు. ఇక కార్తికేయ 2 సినిమాలో సాంకేతిక నిపుణుల వర్క్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కాలభైరవ సంగీతం ఈ సినిమాకి ప్రాణం. నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా కార్తికేయ 2 బాగా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్ :

 

నిఖిల్ నటన

మెయిన్ అడ్వెంచర్ సీన్స్,

మెయిన్ కథకథనాలు

నిఖిల్- అనుపమ మధ్య కెమిస్ట్రీ,

నేపథ్య సంగీతం.

మైనస్ పాయింట్స్ :

కొన్ని సీన్స్ కన్ ఫ్యూజన్ తో సాగడం,

కొన్ని చోట్ల లాజిక్ లెస్ డ్రామా

తీర్పు :

హిస్టారికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కథాంశం, పాత్రల చిత్రీకరణ, క్లైమాక్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ బాగా ఆకట్టుకున్నాయి. నిఖిల్ తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లాడు. ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది.

3 / 5 రేటింగ్ 

బోటమ్ లైన్ : ఇంట్రెస్ట్ గా  సాగే  అడ్వెంచర్ థ్రిల్లర్ !