Guntur Kaaram Movie Review – గుంటూరు కారం మూవీ రివ్యూ

Guntur Kaaram Movie Review

అమ్మ కొడుకుని విడిపోవాలంటే… చనిపోవాలంతే …
గుంటూరు కారం ఈ వారం గురువారం తన ఘాటుని మనకి సంక్రాంతి కానుకగా తెచ్చింది ..
మరి ఆ ఘాటు ఎలా ఉందో తెలుసుకుందామా ..

మహేష్ :
Super స్టార్ అండి , ఊరికే అయిపోతారా … ఆయన కనిపిస్తే ఆడపిల్లల గుండె వేగం పెరిగిపోతుంది , ఇంకా శ్రీలీల, మీనాక్షి ల ఆనందం వారి కళ్ళలో చూడాల్సిందే

గుంటూరు కారం మహేష్ లో చాల రోజుల తరవాత కామెడీ ని , మాస్ ని మళ్ళీ గుర్తుచేసింది. పోకిరి తరవాత అంత ఎనర్జీ మళ్ళీ ఇన్నేళ్లకి మహేష్ ఈ సంక్రాంతికి ఫాన్స్ కోసం ఇచ్చేసాడు కానుకగా , అందుకేనేమో release ఫంక్షన్ లో అంత ఎమోషనల్ అయ్యారు.
వెంకట రమణ గా గుంటూరు మిర్చి , దానికున్న ఘాటు , మొత్తం పుణికి పుచ్చుకుని మనకి ఆనందాన్ని అందించేసారు మహేష్ , ముక్యంగా డాన్స్,మడతపెట్టేసారు అంతే.

ప్రకాష్ రాజ్ :
ప్రకాష్ రాజ్ గురించి చెప్పాలా , అన్నీ తానే , అంతా తానే , చిత్రం మొత్తం అయన నటన చుట్టే తిరిగింది , మహేష్ ప్రకాష్ రాజ్ కలిస్తే రికార్డ్స్ ఎందుకో తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి లేదు

కధ :
వైరా వసుంధర , వైరా వెంకట స్వామి కూతురు , అందుకే తండ్రికి నచ్చని కొడుకుని కూడా వదిలి , భర్తని కాదని రెండో పెళ్లి చేసుకుని తండ్రి వారసురాలిగా ఉండిపోతుంది.రమణ కి తనని ఎందుకు తల్లి వదిలేసిందో తెలీదు , తండ్రి ఎందుకు జైలు కి వెళ్ళాడో తెలీదు , తల్లంటే ప్రేమ తప్ప ఏమి లేదు. ఇంతలో అముక్త మాల్యద (శ్రీలీల) ఎందుకని రమణ దగ్గరకి వస్తుంది ? అసలు వసుంధర రమణని ఎందుకు వదిలేసింది. తెలియాలంటే మాత్రం గుంటూరు కరం చూడాల్సిందే …

ఎడిటింగ్ :
నవీన్ నూలి 50 వ చిత్రం ఎడిటింగ్ కొద్దిగా కంగారుగా చేసాడేమో అనిపిస్తుంది , ప్రథమార్ధం కాస్త కథమీద జాగ్రత వహించివుంటే బాగుండేది అనిపిస్తోంది. ద్వితీయార్ధం కాస్త అనవసరమైన లాగ్ ఉంది అనిపిస్తుంది.

దర్శకత్వం :
త్రివిక్రమ్ మార్కు డైలాగులు మిస్ అయ్యాయి. మాస్ స్టోరీ తీస్కోటం వల్లనేమో ..
కధ రాజమానిక్యం అనే మాతృక లో చిత్రానికి దగ్గరగా ఉన్నా , కావలసిన మార్పులు చేర్పులు త్రివిక్రమ్ చేసుకున్నారనే చెప్పాలి.

థమన్ :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది … కానీ పాటలు మహేష్ స్థాయిలో లేవనే చెప్పాలి …

బాగున్నవి :
మహేష్ , శ్రీలీల మధ్య కెమిస్ట్రీ. ప్రకాష్ రాజ్ , మహేష్ ల మధ్య సన్నివేశాలు. క్లైమాక్స్ లో రమ్య కృష్ణ మహేష్ యాక్టింగ్.

వృధా అయినవి :
రావు రమేష్ , జగపతిబాబు , మీనాక్షి చౌదరి , రాహుల్ , characters వృధాగా అయిపోయాయి .

మొత్తానికి :
మహేష్ చరిష్మా , మాస్ action , శ్రీ లీల అందాలు , రమ్య కృష్ణ , అక్కడక్కడా ఆకట్టుకున్న కామెడీ. సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారానికి ఘాటు ఎక్కువ అని చెప్పేలా చేస్తోంది. ఖచ్చితంగా మహేష్ మాస్ స్టామినాకి సరిపడే చిత్రం ఈ గుంటూరు కారం.

దర్శకత్వం , కథ ,పాటలు కారణంగా చెప్తూ ఈ చిత్రానికి నా రేటింగ్

2.75/5

పవన్ దావులూరి