Eagle Movie Review : రవితేజ ‘ఈగల్’ మూవీ ఎలా ఉందంటే… ?

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా సత్తా చాటుతోన్న రవితేజ ఒకరు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది పలు చిత్రాలతో వచ్చాడు. కానీ, ఇవేమీ రవితేజకు విజయాన్ని మాత్రం అందించలేదు. బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజా నటించిన తాజా చిత్రమే ‘ఈగల్’. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. . హీరో రవితేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ తర్వాత ఆయన నుండి ఆ స్థాయి చిత్రం రాలేదు.

‘ధమాకా’ కొంచెం పర్లేదు అనిపించింది. వరుస చిత్రాలు చేస్తున్నా పరాజయాల శాతమే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవ్వగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. మధుబాల, వినయ్ రాయ్, నవదీప్ కీలక రోల్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అండ్ టీజర్ తో మూవీ పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల నడుమ నేడు (9,జనవరి-2024) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం…

కథ: హీరో రవితేజ ఒక అటివీ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన చుట్టుపక్కల ఎలాంటి అన్యాయం జరిగినా కూడా తను రియాక్ట్ అవుతూ తన అనుకునే వాళ్లను కాపాడుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే కొంతమంది పోలీసులు అతడిని అడవి నుంచి బయటికి తీసుకురావాలి అని కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. మరో పక్క ఇలాంటి సమయంలో రవితేజ అడవి నుంచి బయటకి వస్తే అతన్ని అరెస్టు చేయాలని పోలీస్ లు చూస్తుంటారు. అతడి కోసం పోలీస్ లు ఎందుకు వెతుకుతున్నారు. ఆయన గత చరిత్ర ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ : రవితేజ నటించిన యాక్షన్..సస్పెన్స్ థ్రిల్లర్ ఈ చిత్రం. హీరో గురించి తమకి తెలిసిన కథని అనేక మంది వారివారి కోణాల్లో చెబుతూ కథ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రవితేజ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే. కథలో కొంత కొత్తదనం ఉన్నప్పటికీ కథనం ఆసక్తికరంగా సాగలేదు. సినిమాటోగ్రఫీ పై అవగాహన ఉన్న దర్శకుడు.. కొన్ని సీన్స్ ని హాలీవుడ్ స్థాయిలో చూపించి వావ్ అనిపించాడు. రవితేజకి సీన్స్ అండ్ డైలాగ్స్ తక్కువ ఉన్నపటికీ, ఇతర పాత్రలతో రవితేజని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఎలివేషన్ డైలాగ్స్ కూడా సీన్ కి తగ్గట్టు ఉండడంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శృతిమించిన ఎలివేషన్స్, ఫ్లాట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సాగింది. ‘ఈగల్’ పూర్తిగా కెజిఎఫ్ స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో హీరో గురించి పలు పాత్రలు చెప్పే ఎలివేషన్ సీన్స్ తో సాగుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉన్న ఈ సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి యావరేజ్ గా మారింది. దర్శకత్వ పరంగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు అదిరిపోయింది.

సినిమాలో చాలా మాస్ సీన్లున్నాయి. బీ సీ సెంటర్లు పిచ్చెక్కిపోయే షాట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అమ్మవారి హ్యాండ్స్ నుంచి గన్ జారడం, యాక్షన్ సీక్వెన్స్‌లో గన్నుతో సిగరెట్‌ను వెలిగించుకోవడం ఈ సన్నివేశాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇదో యాక్షన్ డ్రామా.. ఫుల్ స్టైలీష్‌గా ఉంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న స్టోరీ బావుంది. అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలావరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగానే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే డైలాగులను గాని, సాంగ్స్ గాని డిజైన్ చేయించుకున్న విధానం కూడా ఓకే ! ఈ కథకి రవితేజను ఎంచుకొని కూడా దర్శకుడు ఒక మంచి పని చేశాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు ఎక్కువగా యాక్షన్ పార్ట్ ని నమ్ముకొని ముందుకు వెళ్లాడు. కథపరంగా అక్కడక్కడా కొంచెం లూప్ హోల్స్ ఉన్నప్పటికీ రవితేజ తన నటనతో ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి ఆ లూప్ హొల్స్ గుర్తు రాకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇక ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండినప్పటికీ, సెకండ్ హాఫ్ లో మాత్రం అసలైన స్టోరీ ఏంటి అనేది చూపించాడు.

ఎవరెలా చేశారంటే… రవితేజ యాక్టింగ్ వండర్ గా చెప్పుకోవాలి. తన ఫెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లు ఇరగదీశాడు. పెర్ఫామెన్స్ లు బెస్ట్ ఇచ్చాడు. రవితేజ్ మాస్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. రవితేజ బీస్ట్ లా కనిపించాడు. రవితేజ లుక్, క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. రవితేజ ఎనర్జీ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్యాన్స్ కి ప్ ఫీస్ట్. ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ఇక కొన్ని సీన్లలో అయితే రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. దర్శకుడు రాసుకున్న బలమైన సీన్లకి తన యాక్టింగ్ ద్వారా రవితేజ ప్రాణం పోశాడు. ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని రవితేజ కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తాడు. రవితేజ సినిమా భారం మొత్తాన్ని తన భుజాలపై మోసాడు అనే చెప్పాలి. ప్రతి సీన్ లో ఇంటెన్స్ పెర్ఫా మెన్స్ ని ఇస్తూ ఇంతకు ముందు రవితేజ ఎప్పుడూ కనబరచని ఒక కొత్త వేలో తనని తాను మౌల్డ్ చేసుకొని మరి పెర్ఫామ్ చేశాడు. ఆయన యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.

ఇకహీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనుపమ ఈ చిత్రంతో ఆడియెన్స్ కట్టి పడేస్తుంది. జర్నలిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె సహజంగా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరన్ హీరో సహదేవ్ వర్మ గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంది. ప్రతి పాత్ర సహదేవ్ వర్మను ఆకాశానికి ఎత్తుతూ ఉంటుంది. కావ్య థాపర్ ఓకే అనిపించేలా నటన కనబరిచి తన నటనతో అలరించింది. అయితే వినయ్ రాయ్, మధుబాల వంటి నటులను పూర్తి స్థాయిలో వాడుకోలేదనిపించింది. నవదీప్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ లాంటి నటీనటులు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఇంతకు ముందు లా కాకుండా ఒక కొత్త వేలో యాక్టింగ్ ను డెలివరీ చేసి సక్సెస్ అయ్యారు. అందరికీ మంచి పాత్రలు పడ్డాయి.. వీరిని చాలా కాలం గుర్తుంచుకునేలా చేస్తుంది ఈ చిత్రం.

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే …. ఈ సినిమాకి దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ఒక్కరే అవ్వడం వల్ల ఈ సినిమా స్టోరీ ని ఎలాగైతే తను ఇమజిన్ చేసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం లో కార్తీక్ ఘట్టమనేని సక్సెస్ అయ్యాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జంద్ ఈ సినిమాలో కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో తన వంతు పాత్ర అయితే పోషించాడు. ముఖ్యంగా ఈ సినిమాకి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలవడమే కాకుండా, ఈ సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సాంకేతికంగా మూవీ రిచ్ గా ఉంది. యాక్షన్ సీన్లు.. వీఎఫ్ ఎక్స్ లు బాగున్నాయి. బాగా వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్ సోసోనే. . సాంగ్స్ అంతగా ఆకట్టుకోవు. బీజీఎం అదిరిపోయింది. మొత్తంగా ‘ఈగల్’ మాస్ యాక్షన్ డ్రామా. యాక్షన్ ఎపిసోడ్స్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉండి ఆకట్టుకుంటాయి. రవితేజలాంటి ఓ ఎనర్జిటిక్ యాక్టర్.. కార్తీక్ ఘట్టమనేని లాంటి ఓ దర్శకుడికి దొరికితే రిజల్ట్ ‘ఈగల్‌’లానే ఉంటుంది.. ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది.. బిగ్ స్క్రీన్ మీద విస్పోటనం జరిగింది.. స్టార్టింగ్‌లో రిలాక్స్‌గా కూర్చునే ప్రేక్షకుడి.. ఆ తరువాత క్షణక్షణం ఉత్కంఠలా ఫీల్ అవుతాడు.. కథ రొటీన్‌గానే ఉందే అనుకుంటాం.. కానీ అదే టైంలో సర్ ప్రైజ్ వస్తుంది. గన్స్ మీదున్న నాలెడ్జ్‌కు డైరెక్టర్‌కు హ్యాట్సాప్.. ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంది.. చాప్టర్లు, చాప్టర్లుగా ఈ కథను చెప్పే విధానం బాగుంది.. చివర్లో స్టైలీష్ బీజీఏం అదిరిపోయింది.. కొన్ని సీన్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉన్నాయి.. ప్రతీ యాక్షన్ సీన్ తరువాత ఓ ఈగల్ షాట్‌లాంటి డ్రోన్ షాట్ పెడతాడు.. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా ఆ షాట్లుంటాయి.. డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఇక ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్ తాలూకు డిజైనింగ్ అనేది క్లారిటీ గా చేసుకుంటూ వచ్చాడు. ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ క్యారెక్టర్ లో ఇంటెన్స్ పెర్ఫా మెన్స్ ని ఇచ్చారు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాలో విజువల్స్ ని కూడా టాప్ నాచ్ లో చూపించాడు.. మహి బాబు కరణం రాసిన డైలాగులు కూడా సినిమాలో ఎమోషన్ ను బాగా ఏలివెట్ చేశాయి. కరెక్ట్ గా ఏ టైం లో ఎలాంటి డైలాగ్ పడలో అలాంటి డైలాగ్స్ రాసి సక్సెస్ అయ్యాడు. అయితే.. ఆధునిక వేట.. కానీ అదుపు తప్పిన కథ! రవితేజ బెస్ట్ మేకోవర్.. టాప్ నాచ్ విజువల్స్ కోసం సినిమా చూడాల్సిందే..

రేటింగ్ : 2.75/5