జీహెచ్ఎంసీ ఎన్నిక‌లలో చంద్రబాబు, లోకేష్, బాలయ్య ఏమయ్యారు?

why balayya,chandra babu and lokesh are they away from GHMC elections?

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.పోటీలో లేకపోతె ప్రజలు మమ్మల్ని మరిచిపోతారేమో అని ఈ ఎన్నికలలో టీటీడీపీ పార్టీ కూడా పోటీకి దిగింది. పార్టీలన్నిటికి వారి ప్రధాన నాయకులు లేదా స్టార్ లు కలిసి ముందుండి ప్రచారాన్ని నడిపిస్తున్నారు. కానీ టీటీడీపీ మొత్తం ప్రచార బాధ్యత తెలంగాణ తెలుగు దేశం నాయకులపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శులైన చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల ప్రచారంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

why balayya,chandra babu and lokesh are they away from GHMC elections?
why balayya,chandra babu and lokesh are they away from GHMC elections?

చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ వంటి నాయకులు హైదరాబాద్‌లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొని ఉంటే క్యాడర్‌లో మంచి ఉత్సాహాన్ని నింపి ఉండే మాట వాస్తవమే. కానీ, ఇలా చేసి కూడా రేపు ఫలితాల తర్వాత టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం మరీ దారుణంగా ఉంటే అది ఏపీలో కచ్చితంగా రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఒక విశ్లేషణ ఉంది. మరి పోటీ చేసి, కనీస ఓట్లు కూడా పడకపొతే ఉన్న పరువు కూడా పోయి తల ఎత్తలేని స్థితిలో ఉంటారని ఒక విశ్లేషణ వినపడుతుంది. వీటి కన్నా అసలు పోటీ చేయకుండా ఉంటేనే మంచిదేమో అని చాలా మంది అనుకుంటున్నారట .

తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకొనేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్నందుకు ఎదురైన ఘోర పరాభవమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక, కాంగ్రెస్ లాంటి పార్టీతో కలిసినందుకు ఏపీలో టీడీపీకి భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసిన పార్టీతో చంద్రబాబు కలిశారంటూ ఏపీ ప్రజల్లో బాగా వ్యతిరేకత ఎదురైంది. అప్పుడు టీడీపీ అగ్ర నేతలు కనీసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా దాని వల్ల లాభం కన్నా తీవ్ర స్థాయిలో న‌ష్టమే మిగిలింది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలపర్చేందుకు ఎలాంటి వ్యూహరచన చేయటానికి లేకనే అందరూ దూరంగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా ఏపీలో దాని ప్రభావం పార్టీపై నేరుగా పడుతుంది. కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో టీటీడీపీ వ్యూహరచన చేయగలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.