ఎసిబి అడిషనల్ ఎస్పీగా విధుల్లో ఉన్న సునీతారెడ్డిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం తిరిగి ఆమెను విధుల్లో చేరేందుకు అంగీకరించి సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఆమె రెండు రోజుల కిందట డిజిపి ఆఫీసులో రిపోర్ట్ చేశారు. కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున్ రెడ్డి తో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు ఆమె భర్త సురేందర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసు పెద్దలకు, మీడియాకు ఫిర్యాదు చేశారు సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. దీంతో సమాజంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎక్కడ చూసినా సునీతారెడ్డి మీద వార్తలు, కథనాలు వచ్చాయి. వీరిద్దరి బంధం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పోలీసు శాఖపైనా విమర్శలు రావడంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. తన మీద ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయించుకున్నారు సునీతారెడ్డి. కానీ..
ఇదే కేసులో సునితారెడ్డితోపాటు సస్పెండ్ అయిన మల్లిఖార్జునరెడ్డి మీద మాత్రం ఇంకా సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఈ కేసులో సునీతారెడ్డి అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నారు కాబట్టి ఆమె సులువుగా తన మీద ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయించుకున్నారు. కానీ ఆమెకంటే దిగువ స్థాయి అధికారి కాబట్టి మల్లిఖార్జున్ రెడ్డి మీద సస్పెన్ష్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయితే పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మల్లిఖార్జునరెడ్డి మీద ఇప్పట్లో సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు లేవని చెబుతున్నారు. కనీసం మరో ఐదారు నెలలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యవహారంలో సునితారెడ్డి మీద, మల్లిఖార్జున్ రెడ్డి మీద ఆమె భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసులో తీవ్రమైన ఆరోపణలు సునితారెడ్డి కంటే మల్లిఖార్జున్ రెడ్డి మీదనే మోపబడ్డాయి. అర్థరాత్రి పూట సునితారెడ్డి ఉంటున్న నివాసానికి రావడం.. అక్కడ సునితారెడ్డి తల్లి, పెద్దమ్మ ఇద్దరూ కలిసి మల్లిఖార్జున్ రెడ్డి మీద చెప్పులతో దాడి చేయడం జరిగాయి. ఈ విషయంలో న్యూసెన్స్ చేసిన ఆరోపణలు మల్లిఖార్జున్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.
దీంతో ఒకే కేసులో ఒకేసారి ఇద్దరు సస్పెన్షన్ కు గురైనా మల్లిఖార్జున్ రెడ్డి మీద ఇంకా తొలిగించలేదని చెబుతున్నారు. అయితే మల్లిఖార్జున్ రెడ్డి మీద పోలీసు బాస్ లు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. క్రమశిక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖలో ఏకంగా తనకంటే ఉన్నత స్థాయి అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని పోలీసు బాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎంతమాత్రం క్రమశిక్షణ అనిపించుకోదు అని పోలీసు బాస్ లు ఫైర్ అవుతున్నారు. మల్లిఖార్జున్ రెడ్డి విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కన్విన్స్ అయితే తప్ప ఆయన మీద పడిన సస్పెన్షన్ ఎత్తివేసే చాన్స్ లేదని చెబుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపి.. ప్రభుత్వ సూచన మేరకు మల్లిఖార్జున్ రెడ్డి విషయంలో పోలీసు బాస్ లు ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ తతంగం అంతా జరిగే సరికి కనీసం మరో ఆరు నెలలకు పైగానే పట్టవచ్చని పోలీసు శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు.
మరి వారిద్దరూ పెళ్లి చేసుకుంటే..???
నిజానికి సునితారెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారన్న చర్చ కూడా ఉంది. ఆ విషయాన్ని మల్లిఖార్జున్ రెడ్డి ఓపెన్ గానే చెప్పారు. మల్లిఖార్జున్ రెడ్డికి ఇప్పటికే పెళ్లి అయింది. పిల్లలు ఉన్నారు. అయితే ఆయన తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు. అంతేకాకుండా సునితారెడ్డి కూడా తన భర్త సురేందర్ రెడ్డితో విడాకులు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న సందర్భంలోనే ఈ పరిణామాలు జరిగి ఇద్దరూ రోడ్డు మీద పడ్డారని అంటున్నారు. సునితారెడ్డి వ్యవహారం తనకు నచ్చకనే ఆమె మీద పగతో భర్త సురేందర్ రెడ్డి ఆమె గుట్టు రట్టు చేశారన్న చర్చ ఉంద. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే వారు పెళ్లి చేసుకుంటే అప్పుడు మల్లిఖార్జున్ రెడ్డికి త్వరగానే సస్పెన్షన్ రివోక్ అయ్యే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరి సునితారెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి నిజంగానే పెళ్లి చేసుకుంటారా? లేదా అన్నది తేలాల్సి ఉంది.