వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం.. అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు!

హైదరాబాద్ లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన గొడవల కారణంగా వాళ్ళు అర్జున్ ని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇవాళ ఉదయం 6:30 గంటలకు చంచల్ గూ డా జైలు వెనుక గేటు నుంచి రిలీజ్ అయ్యారు. నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ న్యాయవాద బృందంతో మాట్లాడి అక్కడ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. అయితే కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా సరే హీరో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది.

ఇదే విషయంగా అల్లు అర్జున్ బృందం సీరియస్ గా ఉన్నారు.
ఇదే విషయంపై అతని లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ ని తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించిందని అయినా సరే రాత్రంతా ఉద్దేశం పూర్వకంగానే జైలులో ఉంచారని చెప్పుకొచ్చారు .ఈ విషయమై చట్టపరంగా ముందుకు వెళ్తామని, వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా పేర్కొన్నారు.

బెయిల్ వచ్చినప్పుడు ఆలస్యంగా విడుదల చేయటం వలన పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని లాయర్ నిరంజన్ రెడ్డి అన్నారు.అల్లు అర్జున్ ని అరెస్టు చేయటానికి పోలీసులు అతని ఇంటికి వెళ్లి కనీసం అర్జున్ ని బట్టలు కూడా మార్చుకోనీయకుండా అరెస్టు చేసి తీసుకువచ్చారు. తర్వాత అతనిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే జైలుకు తీసుకువెళ్లే లోపే హై కోర్టు నాలుగు వారాల మద్యంతర బెయిల్ అల్లు అర్జున్ కి మంజూరు అయింది.

అయితే పేపర్స్ సరిగ్గా లేవని, టైం కి పేపర్స్ అందలేదని చెప్పి అల్లు అర్జున్ ని జైల్లోనే ఉంచేశారు. పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం విడుదల చేశారు. అయితే మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది. ఇదంతా చూస్తున్న సినీ వర్గంతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం అల్లు అర్జున్ విషయంలో కావాలనే అతడిని ఇరికిస్తున్నారు అని అభిప్రాయపడుతున్నారు.