వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖపై మేయర్ నన్నపనేని నరేందర్ ఫైర్ అయ్యారు. కొండా సురేఖ అనాగరికంగా వ్యవహరించారని విమర్శించారు. ఇక్బాల్ మినార్ పై జరుగుతున్న వివాదాల పై మున్సిపల్ కార్పోరేషన్ ప్రదాన కార్యాలయం కౌన్సిల్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మేయర్ నన్నపునేని నరేందర్. ఆయన కామెంట్స్.
అనవసరంగా కొంత మంది వ్యక్తి గత ఆలోచనలతో ఇక్బాల్ మినార్ ని రాజకీయం చేస్తున్నార. దయచేసి ఆ పని చేయవద్దు. ఏమైనా ఉంటే మనం మనం చూసుకుందాం. అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే ఇక్బాల్ మినార్ ని అభివృద్ధి చేసుకోవాలి. గతంలో కూడా కొండ సురేఖ ఎంతో శ్రమించి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్టాలని చూశారు. కానీ సుప్రీం ఆదేశాల మేరకు నిర్మించలేక పోయారని గుర్తు చేసుకోవాలి.
19 వ తేదీన రోజు అనాగరికంగా ఆలోచించి పోచమ్మ మైదాన్ సెంటర్ లో అలుజడులు సృష్టించారు. నడి రోడ్డు పై డివైడర్ ని పగల కొట్టి ఇక్బాల్ మినార్ నిర్మించడం చట్టవ్యతిరేకమైన పని అవుతుంది. అందుకే మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. అంతేకాని స్థానిక కార్పొరేటర్ శారదా జోషికి కాని ఇతరులకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. ఓ మహిళగా ఓ సోదరిగా నిన్ను (కొండా సురేఖ) గౌరవమిస్తున్నాను కానీ మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోవడం లేదు. మీది 35 ఏండ్ల రాజకీయం.. నాది 3 సంవత్సరాల రాజకీయం. మూడేండ్ల రాజకీయానికే 35 ఏండ్ల రాజకీయం చేసిన మీరు ఎందుకు భయపడుతున్నారు.
వరంగల్ నగర ప్రజలకు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలు కు నా చివరి క్షణం వరకు అండగా ఉంటాను. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చస్తాను. కార్పొరేటర్లకు నాకు మధ్య తండ్రి పిల్లలకు ఉన్నట్టు వంటి సంబంధం ఉంటుంది. ప్రతి విషయంలో మేయర్ ని తప్పు పట్టడం మంచిది కాదు. మనం అందరం కేసీఆర్ వెంటనే ఉన్నాం అక్క గుర్తుంచుకోవాలి. నా లక్ష్యం నగర అభివృద్ధి మాత్రమే. సురేష్ జోషిని, మసూద్ ని సస్పెండ్ చేసే హక్కు ,అధికారం నాకు ,నీకు లేదు.
2014 లో నేను ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తేనే మీకు టికెట్ వచ్చింది. ఆ విషయం గుర్తు ఉంచుకుంటే మంచిది. నేను నగర మేయర్ గా మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు కార్యకర్తలను కాపాడుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా 19 వ తేదీన ఇక్బాల్ మినార్ పై రాజకీయ కుట్ర జరిగినప్పుడు హిందు, ముస్లింలు అర్ధం చేసుకొని ఓపికగా ఉన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. వరంగల్ నగరం చాలా గొప్ప నగరం.ఈ నగరం లో దేశంలో ఎక్కడ లేని విధంగా హిందు, ముస్లింలు ఐక్యతగా ఉంటారు. ముఖ్యంగా హిందుల పండుగలకు ముస్లింలు, ముస్లింల పండుగలకు హిందూలు హాజరై ఎంతో వైభవంగా సంతోషంగా జరుపుకుంటారు. వరంగల్ నగరంలోని హిందు,ముస్లింల ఐక్యతను చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కి డిప్యూటీ మేయర్ గా మైనార్టీకి అవకాశం ఇచ్చారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది తెలుసు.