ఒక్క మహిళ, వంద మంది టిఆర్ఎస్ వాళ్లు… (వీడియో)

పైకి బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఊదరగొడుతున్నారు. బంగారు తెలంగాణ ఏమో కానీ గ్రామాల్లో మాత్రం టిఆర్ఎస్ నాయకులను జనాలు తరుముతున్నరు. తెలంగాణ ఉద్యమంలో చూపిన తెగువ, తెలంగాణ ఉద్యమం నేర్పించిన తిరుగుబాటు, పట్టుదల ఇంకా జనాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు ఆనాడు కాంగ్రెస్, టిడిపి వాళ్లకు జనాలు చుక్కులు చూపించారు. కానీ నేడు ముందస్తు ఎన్నికల హడావిడి చేస్తున్న టిఆర్ఎస్ నేతలకు ఎదురీత తప్పడంలేదు. 

ఈ కింద ఒక వీడియో ఉంది. అందులో ఒక్క మహిళ వర్సెస్ వంద మంది టిఆర్ఎస్ వాళ్లు.. కానీ వారందరినీ ఆమహిళ చెమటలు పట్టించింది. ఆమెతో పంచాయితికి దిగిన టిఆర్ఎస్ నేతలకు వాయిస్ లేకుండా చేసింది. ఆమెను బూతులు తిట్టాలని ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువగా వారిని కడిగి పారేశింది. పక్కనే ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉన్నడు. ఆయన ముందే ఆయన అనుచరులు, ఆ మహిళ జోరుగా పంచాయితి పెట్టుకున్నరు. 

trs leaders

ఇంత జరుగుతుంటే అభ్యర్థి కోరం కనకయ్య సైలెంట్ గా ఇదేదో ఆగానికి వచ్చిందనుకుని తన మనుషులందరినీ అక్కడి నుంచి తీసుకునిపోయారు. కోరం కనకయ్యకు ఈ ఎన్నికల్లో రెండు రకాల తలనొప్పులు తప్పడంలేదు. అందులో ఒకటి పోడు భూములను గుంజుకున్న సర్కారు పై గిరిజనం గుర్రుగా ఉన్నారు. దీంతో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరొచ్చినా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నిలదీస్తున్నారు. గెదుముతున్నారు.

ఇక అంతేకాకుండా ఎస్టీల్లో లంబాడీల రిజర్వేషన్లు తొలగిస్తున్నారన్న ప్రచారం గతంలో జరిగింది. ఆ ప్రయత్నం సర్కారు చేసిందా? లేదా అన్నది పక్కన పెడితే అదొక ప్రతిపాదన ఉన్నట్లు చర్చ ఉంది. లంబాడీలను ఎస్టీ జాబితాలోంచి తొలగిస్తే ఇక గిరిజన బిడ్డలకు కొలువులు ఎట్లా వస్తాయని లంబాడీ యూత్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. గతంలో ఈ విషయమై కోరం కనకయ్య మీద కరపత్రాలు ముద్రించారు. దీంతో వారంతా ఆయన ప్రచారానికి పోగానే అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. ఉగ్రరూపం దాలుస్తున్నారు. 

ఎమ్మెల్యే అయితే నాకేంది మంత్రి అయితే నాకేంది? ప్రశ్నించడం, నిలదీయడం తెలంగాణ ఉద్యమమే మాకు నేర్పింది అంటున్నారు గ్రామీణ ప్రజలు, గిరి జనాలు. మరి ఈ ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి ఇంకా ఏరకమైన నిలదీతలు, ప్రశ్నించడాలు చూడాల్సి వస్తుందో మరి.