కేంద్రంలో బీ.ఆర్.ఎస్ పార్టీ ద్వారా సత్తా చాటాలని ప్లాన్ చేసిన కేసీఆర్ కు ఈ మధ్య కాలంలో ఎదురుదెబ్బలు ఎక్కువగా తగులుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన సీబీఐ కవితను విచారించిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు కూడా వాటా ఉందని ప్రూవ్ అయితే అధికారులు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. కవిత విచారణ కేసీఆర్ ను సైతం తెగ టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది.
అయితే విజయసాయిరెడ్డి వల్లే కవిత బుక్కయ్యారని కామెంట్లు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ కు షాకిచ్చే దిశగా బీజేపీ ప్రణాళికలు సిధ్దం చేయగా లిక్కర్ స్కామ్ ద్వారా కేసీఆర్ సర్కార్ ఆ అవకాశం ఇచ్చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి విజయసాయిరెడ్డి సన్నిహితుడు కాగా ఆ నమ్మకంతో తనకు ఏ సమస్య రాదని కవిత భావించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు అందే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఈ కేసు విషయంలో పట్టుదలతో ఉందని రాబోయే రోజుల్లో కేసీఆర్ సర్కార్ కు మరిన్ని షాకులు ఖాయమని సమాచారం అందుతోంది. రాజకీయంగా కేసీఆర్ సర్కార్ ను దెబ్బ కొట్టాలనే ఆలోచనతో మోదీ సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ ఈ కేసులో కవిత తప్పేం లేదని ప్రూవ్ అయితే మాత్రం బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని వినిపిస్తోంది. ఈ వివాదం వల్ల బీజేపీ, టీ.ఆర్.ఎస్ పార్టీలలో ఏదో ఒక పార్టీ ప్రజల ముందు చులకన కావడం ఖాయమని ఇందుకు సంబంధించి సందేహం ఏ మాత్రం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.