టిఆర్ఎస్ మాగంటి గోపినాథ్ కు చుక్కలు చూపిస్తున్నారు…

టీఆరెస్ పార్టీ నాయకుడు మాగంటి గోపినాథ్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి . తెలుగుదేశం పార్టీ నుంచి శాసన సభ్యుడుగా గెలుపొందిన గోపినాథ్ చంద్ర శేఖర్ రావు ఆకర్ష్ కు లోనై టీఆరెస్ పార్టీలో చేరాడు . చంద్ర శేఖర్ రావు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు . అదేరోజు 105 మంది శాసన సభ అభ్యర్థులను కూడా ప్రకటించాడు . అందులో జూబ్లీ హిల్స్ స్థానాన్ని మాగంటి గోపినాథ్ కు కేటాయించాడు . జూబిలీహిల్స్ అనగానే ధనవంతులు ఎక్కువగా వుంటారు . ఈ ప్రాంతంలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ. అందులో కమ్మ సామాజిక వర్గం , సినిమావారు వున్నారు .


మాగంటి గోపినాథ్ కు కమ్మ సామాజిక వర్గం వాడు మాత్రమే కాదు సినిమా నిర్మాత కూడా . భద్రాద్రి రాముడు, నా స్టయిలే వేరు అనే సినిమాలు నిర్మించాడు . భద్రాద్రి రాముడు సినిమాలో తారక రత్న హీరోగా నటించాడు . హీరోయిన్ గా ప్రస్తుత కర్ణాటక ముఖ్య మంత్రి కుమారస్వామి భార్య రాధిక నటించింది . గోపినాథ్ కు సినిమా రంగంలో అన్ని శాఖల వారితో సంబంధాలు వున్నాయి . అందుకే చంద్ర శేఖర్ రావు ముందు చూపుతో జూబిలీహిల్స్ స్థానాన్ని గోపినాథ్ కు కేటాయించాడు . ఇంతవరకు బాగానే వుంది . అయితే టీఆరెస్ పార్టీ కార్పొరేటర్లు మాగంటి గోపినాథ్ ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అతన్ని మార్చాలని ధర్నా నిర్వహించారు . ఒకసారి చంద్ర శేఖర్ రావు ప్రకటించిన తరువాత మార్చడం అనేది ఉండదు . మరి స్థానికులు సహకరించకపోతే …?

ఇప్పుడు తెలుగు దేశం , కాంగ్రెస్ పార్టీ కలసి పోటీ చెయ్యబోతున్నాయి . జూబిలీహిల్స్ స్థానానికి కమ్మ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం వుంది. జూబిలీహిల్స్ అయితే గ్యారంటీ అనుకుంటున్న మాగంటి గోపినాథ్ కు ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చింది . దీని నుంచి గోపినాథ్ ఎలా బయట పెడతాడో మరి ?**