తెలంగాణ బీజేపీకి అసలు సమస్య ఇదే.. 2024లో అధికారంలోకి వస్తుందా?

2024 సంవత్సరంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. అయితే వాస్తవంగా ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు చాలామంది లేదనే సమాధానం చెబుతున్నారు. పార్టీని గెలిపించే నాయకుల లేమి తెలంగాణ బీజేపీకి శాపమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అనుకూల ఫలితాలు రాలేదు.

అయితే ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో క్రమంగా పుంజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బీజేపీపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఆ పార్టీకి ఒక విధంగా ప్లస్ అవుతోంది. తెలంగాణ ప్రజలలో చాలామంది ప్రజలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నా బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీ పాలిట శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. బీజేపీ ముఖ్య నేతలు ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో బీజేపీలో చాలామంది నేతలు చేరినా ఆ నేతలలో చాలామందికి స్థానికంగా బలం లేదు. వీళ్లంతా పార్టీ బలాన్ని నమ్ముకుని అన్నీ అనుకూలిస్తే ఎన్నికల్లో విజయం సాధిస్తామని భావిస్తుండటం గమనార్హం. బీజేపీ అటు ఆర్థికంగా, ఇటు ప్రజల్లో బలంగా ఉన్న అభ్యర్థులను ఎంచుకుంటే మాత్రమే ఫలితాలు మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నియోజకవర్గ స్థాయి నేతలు బీజేపీపై దృష్టి పెడితే మాత్రమే ఈ పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుంది.

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తే మాత్రమే బీజేపీకి కచ్చితంగా ప్లస్ అవుతుంది.. మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే బీజేపీకి మరింత ప్లస్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ 2024లో కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉంటే తెలంగాణలో బీజేపీ మరింత మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.