గ్రేటర్ ఎన్నికలలో తెరాసని దెబ్బ కొట్టబోతోన్న అతిపెద్ద ఫ్యాక్టర్ ఇదే? జాగ్రత్త పడకపోతే కెసిఆర్ అట్టర్ ప్లాప్ ?

this is the factor that effects on trs party in greater elections

హైదరాబాద్: ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయినా జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ పాలన, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు. అది అందరికీ తెలిసిందే. కానీ రాను రాను ఈ ఎన్నికల్లో జయాపజయాలు పార్టీ భవిష‌్యత్ ను నిర్దేశిస్తాయని చెప్పక తప్పదు.ప్రధానంగా కరోనా ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే అవకాశముంది. కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులను పెద్దగా పట్టించుకోక పోవడం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను నిరాశకు గురి చేసింది. వారంతా టీఆర్ఎస్ పై నెగిటివ్ ధోరణితో ఉన్నట్లు కనపడుతుంది. దీంతో పాటు కరోనా టెస్ట్ ల సంఖ్య కూడా సక్రమంగా చేయకపోవడం వల్లనే కేసుల సంఖ్య పెరిగిందన్న వాదన కూడా ఉంది. కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోవడం, కొందరు లక్షల రూపాయలు వెచ్చించినా ప్రాణాలు దక్కించుకోలేక పోవడం వంటివి కేసీఆర్ కు మైనస్ గా మారనుంది.

this is the factor that effects on trs party in greater elections
KCR

ఇక ఇటీవల వరదల సమయంలో ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందన్న అభిప్రాయం అనేక చోట్ల కనపడుతుంది. హైదరాబాద్ లో 75 శాతం వరద ఎఫెక్ట్ అయింది. అయితే వరద సమయంలో దాదాపు వారం రోజుల పాటు నరకయాతన పడినా ప్రభుత్వం కాని, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదన్న అక్కసును ఆ ప్రాంత ప్రజలు వెళ్లగక్కుతున్నారు. దీంతోపాటు వరద సాయం కూడా అందరికీ అందకపోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కారణమంటున్నారు.

అందువల్లనే ప్రచారానికి వెళ్లిన అధికార టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు అనేక చోట్ల నిలదీస్తుండటం కన్పిస్తుంది. కేసీఆర్ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చినప్పటికీ అది ప్రభుత్వంపై ఉండటంతో ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్న లెక్కలు విన్పిస్తున్నాయి. వరద సమయంలో తమను పలకరించడానికి వచ్చిన వాళ్లు కూడా లేరన్న విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. మొత్తం మీద కరోనా, వరదలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతీస్తాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.