TG: అల్లు అర్జున్ వెనుక ఓ మహాశక్తి ఉంది… ఆయన జైలుకు వెళ్లడం ఖాయం: సీనియర్ లాయర్

TG: అల్లు అర్జున్ వ్యవహారం దాదాపు 20 రోజులు అవుతున్న ఇంకా సర్దుమనడం లేదని చెప్పాలి. అల్లు అర్జున్ ఘటన గురించి ప్రతి ఒక్కరు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ లాయర్ పాదూరి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతు.. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యి, జైలుకు వెళ్లి వచ్చారని.. ఆయనకు బెయిల్ కొద్ది రోజులకు మాత్రమే వచ్చిందని అది కూడా రెండు మూడు రోజులలో రద్దు అవుతుందని ఆయన తప్పకుండా జైలుకు వెళ్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా లాయర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సీఎం ను ఏ విధంగా అయితే మార్చారో తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ సినిమాలో పుష్ప తనకు ఫోటో ఇవ్వలేదని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేశారు అలాగే తెలంగాణలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు అల్లు అర్జున్ అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి పీఠాన్ని కదిలించబోతున్నారని తెలియజేశారు.

అల్లు అర్జున్ వెనుక ఏదో ఓ మహాశక్తి ఉంది ఆ శక్తి తనని నడిపిస్తుందని గడిచిన 48 గంటలుగా ఈ వ్యవహారంపై పెద్ద కుట్ర జరుగుతుందని, అల్లు అర్జున్ వెనుక ఓ శక్తి ఉందని, రేపటి నుంచి వారం రోజుల్లో రేవంత్ సర్కార్ ను కూల్చడానికి ప్లాన్ చేశారని తెలిపారు. ఈ వారం రోజులలో బీఆర్ఎస్ బిజెపి పార్టీ నేతలు అనుకున్న పనిని చేయాలని భావిస్తున్నట్లు ఈయన తెలిపారు.

ఇలా కొంతమంది నాయకులు అల్లు అర్జున్ అడ్డుపెట్టుకొని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవినీ టార్గెట్ చేస్తూ తనని పదవి నుంచి తొలగించాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కామెంట్లు చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయం గురించి కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడొద్దు అంటూ ఆయన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.