* నీ నాయకుడి కోసం నువ్వు బట్టలు చింపుకో – ఆయన మాత్రం ఖద్దరు చొక్కా వేసుకుంటడు
* నీ నాయకుడి ప్రచార ర్యాలీలో నువ్వు ఎండలో మాడిపోతు నినాదాలు చెయ్యి – ఆయన మాత్రం AC కారులో కూర్చుని ఉపన్యాసం చెస్తడు
* నువ్వు ఆయన మీద అభిమానంతో ఇంట్లో ఉన్నదమ్ముకుని తిరుగు – ఆయన ఇల్లు మాత్రం ఏటికేడు ఒక అంతస్తు పెరుగుతుంది
* బహిరంగ సభలో నువ్వు ఎండను వానను లెక్క చేయకుండా అరుస్తావుండు – ఆయన మాత్రం సభాస్థలి మద్యలో చల్లటి ఫ్యాన్ గాలి లో తేలిపోతుంటడు
* ప్రచారం లో నీ చేతిలో ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు సీసా – ఆయనేమో స్టార్ హొటల్ లో విందు భోజనం
* నీ నాయకుడి జీవిత చరిత్ర అంతా నీకు తెలుసు, ఆయన కోసం చావడానికి రెడీ అవుతవ్ – ఆయన కి మాత్రం నువెవరో తెలీదు , లక్షల్లో ఒకడివి
* పనులు పక్కనపెట్టి నీ నాయకుడిని గెలిపించాక నీ జీవితం మారుతుందా ?
* అవే అప్పులు అవే తిప్పలు
రోగానికి ఖర్చు, ఆనందానికి ఖర్చు
రోజూ తిండికి ఖర్చు, కట్టే బట్టకు ఖర్చు .
నీకు సాయం చేసేవాడు ఏడీ ?, ఎటూ దారిలేక నీ నాయకుడి దగ్గరకు వెళ్తే – తిరుమతిలో వెంకన్న దర్శనం చేసుకోవచ్చు కానీ ! నీ నాయకుడి దర్శనభాగ్యం కలుగదు
కనిపించాక కూడా సాయం కోసం వాడి కాలు పట్టుకోవాల్సిందె …
* నువ్వు మాత్రం అదే డొక్కు సైకిల్, బండితో జీవితాన్ని లాగుతూ సచ్చిపో – నీ నాయకుడు మాత్రం కోట్లు వెనకేసి ఆయన ముని మనవడి భవిష్యత్ గురించి ఆలోచిస్తడు
* ఓటు కోసం నీ ఇంటికొచ్చిన నాయకుడు గెలిచాక ఎందుకు నీకు అందుబాటులో లేడు ?, ఆయన్ని కలవాలంటే ఎంత కష్టం !
* ఇచ్చిన హామీలను నెరవెర్చు అని అడిగితే ఎందుకు పక్కనున్న పోలీసులు నిన్ను పిచ్చోడిలా లాకెలుతారు ! – వాలకి నీ మీద చెయ్యేసె అధికారం ఎవరిచ్చారు ? – నీ నాయకుడు !
* ఆ నాయకుడుకి అధికారం వచ్చెలా చెసింది నీ ఓటు, నీ ప్రచార కష్టం – అలాంటిది నిన్ను ఒక పిచ్చోడిలా పోలీసులు కొడుతుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నడు ?
* ఓటు కోసం నీ పూరి గుడిసెలోకి వచ్చి నిన్ను హత్తుకుని మాట్లాడే నాయకుడు – గెలిచాక ఆయన ఇంటి గెటు దాటగలవా ?, నా నాయకుడే కదా అనీ ఇంట్లోకి వెళ్లే ద్యైర్యం చేయగలవా ?
* ఆయన కు AC కార్ రావడానికి కారణమైన నువ్వు – ఆయన వస్తుంటే ఎందుకు నువు పక్కకి తప్పుకుంటున్నట్లు ? ఏం తప్పు చేశావ్ ?
* ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయన రాకకోసం ఎందుకు పది నిమిషాల ముందే నిన్ను ఆపెస్తున్నరు ?
* నీ నాయకుడికి రాష్ట్రాన్ని ఏలే అతిపెద్ద ఉద్యోగం ఇచ్చిన నీకు ఎందుకు చిన్న ఉద్యోగం కూడా దొరకట్లేదు ?..
ఉద్యోగం కోసం వాలని ప్రాదేయపడుతూ, వాల కరుణ కోసం ఎదురుచూస్తున్నవ్ !.
వీలైతే ఉద్యోగాల కోసం ధర్నా చేసి మళ్లీ పోలీసులు చేతిలో తన్నులు
వేలకి వేలు పోసి కోచింగ్ లు !
* మన పిల్లలు సర్కారి పాఠశాలలో ఒకపూట భోజనం తో చదువు ! – నీ నాయకుడి పిల్లలు లక్షల రూపాయలు ఫీజు తో చదువు
* నీ నాయకుడి పిల్లలు ఏదైనా కంపెనీ కి CEO, MD – నీ పిల్లలు వాడి దగ్గర అటెండర్, ఆఫీస్ బాయ్ !
లేదా తండ్రి వారసత్వం గా వాళ్ళు రాజకేయాల్లోకి వస్తే – మళ్లీ నీ పిల్లలె నువు పడ్డ కష్టం చేసి వాళ్ళని గెలిపించాలి !
* తరతరాలు వాళ్ళు ప్రభువులే – మనం వాళ్ళ భటులమే !
మనవి ఎప్పటికీ ఈ అప్పుల తిప్పల బతుకులే
ఇంకెన్నటికి మారును మన జీవితచిత్రం
ఆలోచించండి ….
నాయకుల వెంట తిరిగి మీ భవిష్యత్తుని పాడు చేసుకోకండి.
తొడబుట్టిన వాళ్ళని కూడా ఎదగనివ్వని నాయకులు,
ఎవరో అనామకుడివైన నిన్ను ఎందుకు పట్టించుకుంటారు.
వాళ్ళు ఎదగటానికి నిన్ను ఒక పావు గా మాత్రమే వాడుకొని వదిలేస్తారు.
- అది ఇది అనకుండా, వారు వీరు అని కాకుండా అన్ని పార్టీలకు, అందరికి, అన్ని సందర్భాలలో వర్తించే పొలిటికల్ ఫిలాసఫీ (ఎడిటర్ కామెంట్)
(రచయిత ఎవరో తెలియదు. సోషల్ మీడియా నుంచి సేకరించింది )