రేవంత్ రెడ్డి గురించి నిజం చెప్పిన తారా చౌదరి

రేవంత్ రెడ్డికి, తారా చౌదరికి మధ్య సంబంధం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం గురించి ఆమెను ప్రశ్నించగా  తారా చౌదరి ఇలా స్పందించింది. 

రేవంత్ రెడ్డి గారిని నేను ఇప్పటి వరకు కలవలేదు. ఆయనకు నాకు పరిచయం లేదు. ఆయన్ని కేవలం టీవీ లో, పేపర్లో మాత్రమే చూశాను. కొన్ని టీవీ ఛానెల్స్ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి దుష్ప్రచారం చేశాయి.

ఆయన పొలిటికల్ గా ఫార్మ్ లో ఉన్నప్పుడు రాజకీయంగా దెబ్బ తీయటానికి అప్పటి అపోజిషన్ పార్టీలు ఇలాంటి పుకార్లు సృష్టించాయి. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయనను నేను ఒక అన్నలా భావిస్తున్నాను. ఒకవేళ ఫ్యూచర్ లో ఆయన్ని కలిసే అవకాశం వస్తే ఒక సోదరిలా ఆయనను కలుస్తాను అని తెలిపింది తార.