TG: తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొత్త చట్టం.. ఇకపై మార్చడానికి వీలు లేదా?

TG: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లి మార్పు గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఆ సమయంలో ఈయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే గత ఏడాది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశారు. అయితే ఈ తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ విషయంలో బిఆర్ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

ఇలా తెలంగాణ తల్లి మార్పును బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అయితే నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున వాదోపవాదనలు వినిపించాయి. ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలను మార్చడానికి వీలు లేకుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లి స్వరూపం అనేక రూపాల్లో ఉన్నాయని అన్నారు.

తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని రూపకల్పన చేసి సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా కంటే, హారంతో, కాళ్ళకు మెట్టెలతో, పచ్చని చీరతో, మన పంటలకు చిహ్నంగా రూపొందించామన్నారు. తెలంగాణ తల్లికి వాడిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భట్టి విక్రమార్క తెలిపారు.

జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చినట్టు తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరపాలని ఈయన సూచించారు. ఇక తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పునకు కూడా పరిశీలిస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.