TG: తెలంగాణ ఉద్యమ తల్లి.. కాంగ్రెస్ తల్లిగా మారింది.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్!

TG: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు ఈ క్రమంలోనే గత పది రోజులుగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ విజయోత్సవాలు చివరి రోజుల్లో భాగంగా సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ విగ్రహ ఏర్పాటు విషయంపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పట్లో కెసిఆర్ ఆవిష్కరించారు అయితే ఆ విగ్రహం కేసీఆర్ కూతురు కవితను పోలి ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహం పట్ల ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా కవిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపు రేఖలను మార్చేయడం చాలా దురదృష్టకరమని తెలిపారు. ప్రభుత్వం దుశ్చర్యలకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ తల్లి కాస్త నేడు కాంగ్రెస్ తల్లిగా మారిపోయిందని ఈమె మండిపడ్డారు.కాంగ్రెస్ తల్లి విగ్రహావిష్కరణను తాము తిరస్కరిస్తున్నామని అన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను కూడా దూరం చేశారని ఆక్షేపించారు.

ఇక ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల కేవలం బిఆర్ఎస్ నేతలు మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విగ్రహాన్ని మార్చడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వం అంటూ చెప్పుకు వచ్చారు. అయితే రాజకీయాలకు అతీతంగా తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటూ రేవంత్ రెడ్డి చెప్పుకు వస్తున్నారు.