TG: రాజకీయ పార్టీలన్న తర్వాత శత్రువులతో పాటు మిత్రులు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారడంలో అతిశయోక్తి లేదు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు పొందిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.అలా ప్రత్యేక తెలంగాణ సమయంలో టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఈయన గతంలో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని కూడా ఎన్నికలలోకి దిగారు.
ఇక తెలంగాణ వేరుపడిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ కెసిఆర్ కుటుంబ సభ్యులను కానీ విమర్శించింది లేదు. కానీ కెసిఆర్ మాత్రం ప్రతిసారి తెలుగోల్ల పెత్తనం మనకు అవసరమా అంటూ తెలంగాణ వారిని రెచ్చగొడుతూ అక్కడ టిడిపి పార్టీ లేకుండా చేసేసారు.
ఇక కెసిఆర్ కుటుంబ సభ్యులు తరచు కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే మరోవైపు చంద్రబాబు నాయుడు పేరును కూడా ప్రస్తావించేవారు. రేవంత్ రెడ్డిని మీ గురువుగారు చిట్టినాయుడు అంటూ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకువచ్చారు. ఇకపోతే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎక్కడ విమర్శించలేదు అలాగే రేవంత్ రెడ్డిని ఎక్కడ పొగడ్తలతో ప్రశంసించలేదు.
ఇలా ఏపీ సీఎం తెలంగాణ మాజీ సీఎం గురించి ఎక్కడ ప్రస్తావించకపోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం తరచు చంద్రబాబు నాయుడు గురించి విమర్శలు చేస్తూ వచ్చారు..తాజాగా కవిత సైతం తెలంగాణ తల్లి విగ్రహ మార్పులు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు పేరును పలకడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారాయి.
ఉద్యమాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల జోలికి రాకండి, అలా వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీ గురువు చంద్రబాబుకు తెలుసు, కనీసం ఆయను చూసి అయినా నేర్చుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు.అసలు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధం ఏంటో కవిత చెప్పగలరా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా కేసీఆర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో ఇలా మాట్లాడుతున్నారా లేకపోతే చంద్రబాబు అంటే ద్వేషమా అనేది తెలియదు కానీ తరచూ ఇలా విమర్శలు చేయడం మంచిది కాదని చెప్పాలి.